బిజెపి అధికారంలోకి వస్తేనే బీసీలకు సమన్యాయం  ఆచారికే బీసీ సంఘాల మద్దతు

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబరు 27 : తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తేనే బీసీల కు సముచిత గౌరవం సమన్యాయం లభిస్తుందని జాతీయ బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. పెద్దయ్య యాదవ్, రాష్ట్ర బీసీ సంఘం సీనియర్ నాయకుడు కల్వకుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జి గంగాధర్ అన్నారు. సోమవారం ఆమనగల్లు లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిషాలు భారీ బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని ప్రకటించడం హర్షించదగ్గ విషయం అన్నారు. 75 ఏళ్ల భారత స్వాతంత్ర దేశంలో ఇప్పటివరకు బీసీ ముఖ్యమంత్రి కాలేదని బిజెపి బీసీలకు సముచిత స్థానం కల్పించి అత్యధికంగా బీసీలకు అసెంబ్లీ సీట్లు కేటాయించడం జరిగిందన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం లో ఉద్యమాల ముద్దుబిడ్డగా బీసీల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన ఆచారి కి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సంఘాలన్నీ మద్దతు తెలుపుతున్నాయని వారన్నారు. ఇప్పటివరకు కల్వకుర్తి నియోజకవర్గం మూడుసార్లు ఎమ్మెల్యేగా జైపాల్ యాదవ్ కు అవకాశం ఇచ్చామని ఈసారి ఆచారిని గెలిపించుకుంటామన్నారు. ఆచారిని చట్టసభల్లోకి పంపిస్తే బీసీల సమస్యలపై హక్కులపై పోరాటం చేసి సాధించుకుంటామన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం లో ఆర్డీవో కార్యాలయం కోసం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం కల్వకుర్తి పట్టణ అధ్యక్షుడు ఎం. లక్ష్మయ్య గౌడ్, చారగొండ మండల అధ్యక్షుడు సి. అంజయ్య గౌడ్, అఖిల భారత విశ్వకర్మ మహాసభ అధ్యక్షుడు కౌల జగన్నాథం, గౌరవ అధ్యక్షుడు చెన్నయ్య చారి, సోమాచారి, మునుగంటి బ్రహ్మచారి, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జనరల్ కార్యదర్శి అనంతోజు బ్రహ్మచారి, కోశాధికారి ఎర్రోజు రవి, మాజీ ఎంపిటిసి తల్లోజు వెంకటయ్య, పద్మశాలి సంఘం నాయకుడు లింగం, ముక్తాల వెంకటయ్య, పలువురు బీసీ సంఘం నాయకులు నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *