ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 8 : బీ ఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చిలకా నగర్ డివిజన్ లోని వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఉప్పల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగాచిలుకానగర్ డివిజన్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆకిని బాల్ రెడ్డి, మెట్టు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో, ఎడ్ల బాల్ రెడ్డి, పిన్నపు రెడ్డి మల్లారెడ్డి, ల్యాగ నర్సింహా రెడ్డి, ల్యాగ సంతోష్ రెడ్డి, పాతపల్లి శ్రీనాథ్ రెడ్డి, పొన్నాల రాంరెడ్డి తదితరులకు బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి గారు వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
బిఆర్ఎస్ లో భారీ చేరికలు




