బిఆర్ఎస్ లో చేరిన యువ ఓటర్లు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 31: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి పటాన్ చెరు యువ ఓటర్లు మద్దతు ప్రకటించారు. పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు జీవన్ ఆధ్వర్యంలో పటాన్ చెరు డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్, సీతారామపురం కాలనీ చెందిన 70 మంది యువ ఓటర్లు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ సమక్షంలో బిఆర్ ఎస్ పార్టీలో చేరారు. పటాన్ చెరు నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో తామంతా పనిచేయునున్నట్లు వారు తెలిపారు.రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ విజయానికి సైనికులవలె కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *