బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యే బేతి ముఖ్య అనుచరులు

  ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 14:  ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ముఖ్య అనుచరులు మంగళవారం టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.. రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో నేడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.ఎమ్మెల్యే బేతి ముఖ్య అనుచరులుగా ఉంటున్న పలువురు నేతలు గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు..ఎమ్మెల్యే బేతి, ఇతర నేతలు తమను పట్టించుకపోవడం పార్టీలో ఉంటే ఉండండి పోతే పోండి.చులకన బావం ఎక్కువైందని వారు పేర్కొంటున్నారు.బిఆర్ఎస్  పార్టీకి రాజీనామా చేసిన వారిలో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ముఖ్య అనుచరులు జనంపల్లి వెంకటేశ్వర.రెడ్డి, గరిక సుధాకర్ రాష్ట్ర నాయకులు. ఉద్యమకారులు , కొండల్ రెడ్డి,వనంపల్లి గోపాల్ రెడ్డి, బండ వినేష్ రెడ్డి, కొంగల శ్రీధర్, కొంగల నరసింహ, నానాపురం వంశీ, MD  సర్పరాజ్ , చందు, ఎరువ అశోక్, ప్రభాకర్, MD యూసుఫ్, శ్రీలత యాదవ్, ధనలక్ష్మి, భాగ్య రేఖ, విజయ్ కిరణ్, నరేష్, యాదగిరి  తదితరులు ఉన్నట్లు వారు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *