కీసర, ప్రజాతంత్ర , నవంబర్ 24 : మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి చామకూర మల్లారెడ్డికి మద్దతుగా 15వ వార్డులో కౌన్సిల్ మాదిరెడ్డి వెంకటరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఆదం షఫీక్, మైనార్టీ అధ్యక్షుడు షేక్ ఖాజా, బిఆర్ఎస్ నాయకులు సత్యం సాగర్, రాపోలు ప్రవీణ్, భుమలింగం శుక్రవారం ప్రచారం నిర్వహించారు. వారు మల్లారెడ్డిని గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు బిఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రచారం చేసే ప్రతిపక్ష పార్టీల నాయకుల మాటలను ప్రజలు నమ్మరని తెలిపారు. బిఆర్ఎస్ తోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. ప్రచార సమయంలో ప్రజలు బిఆర్ఎస్ బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. బిఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. బి ఆర్ఎస్ తోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణలో అధికారంలోకి రారు అన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డికి మద్దతుగా ప్రచారం





