ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి దయ తో బిఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవాలని మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ నాగేశ్వరరావు ఆకాంక్షించారు. సోమవారం బండారు లక్ష్మా రెడ్డి గెలవాలని రామంతాపూర్ పెద్దచెరువు వద్ద కట్ట మైసమ్మ అమ్మవారి కిప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొదటిరోజు పాదయాత్రను గంథం జోత్స్నా నాగేశ్వరావు అద్వర్యం లో బిఆర్ఎస్ నాయకుల తో కలిసి ఇంద్రానగర్,ప్రగతి నగర్ లో పాదయాత్రను నిర్వహించి విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకి ఓటు వేసి బండారి లక్ష్మారెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్ గౌడ్,ముస్తాక్ ,రాజు యాదవ్ ,సురం శంకర్ ,శ్రీనివాస్ రెడ్డి ,బుస శంకర్,చాంద్ పాషా,తిప్పని సంపత్, బోసాని పవన్,శ్రీకాంత్ గౌడ్,ప్రశాంత్ గౌడ్,వెంపటి శ్రీను,మద్దురి శ్రీనివాస్,దయాకర్ రెడ్డి,నరసింహ రెడ్డి ,వనంపల్లి శ్రీనివాస్,మున్న ,రాజు , లడ్డుభాయ్,బాబు రావు,మల్లేష్ యాదవ్,టిల్లు,బబ్లు తదితరులు పాల్గోన్నారు ..
బిఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మా రెడ్డి గెలుపుకై పాదయాత్రతో విస్తృత ప్రచారం : మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ నాగేశ్వరరావు



