బిఆర్ ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి

కులకచర్ల, ప్రజాతంత్ర, ఆగస్ట్18:బిఆర్ ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పరిగి నియోజకవర్గ నాయకుడు మారుతి కిరణ్ బూనేటి, వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గణపురం వెంకటయ్య గౌడ్ లు అన్నారు.శుక్రవారంనాడు మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు గాదె మహిపాల్ ముదిరాజ్ అధ్యక్షతన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, గృహలక్ష్మి పథకం, బీసీ బందు, బిఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను అమలు చేయడంలో వైఫల్యాన్ని నిరసిస్తూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.అనంతరం తహశీల్దారుకు మెమొరాండం అందజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడారు..ఎన్నికలు మరో మూడు నెలల్లో సమీపిస్తుండడంతో  ఆచరణకు సాధ్యం కానటువంటి  హామీలతో కేసిఆర్ ఓట్ల రాజకీయం మొదలుపెట్టారన్నారు,ఇప్పటివరకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా సరిగా అమలు చేయలేదు,ఎక్కడో ఒకచోట బిఆర్ఎస్ నాయకులకు తప్ప ఈ పేద వారికి ఏ పథకం అందించలేదని బిఆర్ఎస్ పాలనను ఎండగట్టారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 9 సంవత్సరాలు పూర్తవుతున్న ఇంకా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ప్రతి సంవత్సరం ఇస్తామని మోసపూరితమైన  హామీలు ఇస్తూ కల్లబొల్లి మాటలు చెబుతూ కాలం గడుపుతున్నారు. ఈ ప్రభుత్వం ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 5000 ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చినా మన కుల్కచర్ల మండలంలో ఒక్క ఇల్లు కూడా ఇప్పటివరకు నిర్మించి ఇవ్వలేదు.అర్హులైన వాళ్ళందరికీ కాళీ జాగా ఉంటే ఇల్లు కట్టుకోవటానికి అట్లాగే ఇల్లు పాడు అయిపోయి ఉంటే రిపేర్ చేసుకోవడానికి 5 లక్షలు  ఇస్తామని వాగ్దానం చేసి దాన్ని మూడు లక్షలకు కుధించి కేవలం మూడు రోజుల సమయాన్ని ఇచ్చి అప్లికేషన్ చేసుకోవాలని చెప్పటం మోసపూరిత చర్య అని అన్నారు. బీసీల అందరికి ప్రయోజనం చేకూరెలాగా బీసీ బందు ప్రకటిస్తానని వాగ్దానం చేసి మోసపూరితంగా  బీసీల్లో కొన్ని కులాలకు మాత్రమే వర్తించే విధంగా అది కూడా లక్ష రూపాయలకే దాన్ని కుదించి బీసీలను తీవ్రంగా వంచించిన ప్రభుత్వం వెంటనే అన్ని కులాలకి వర్తించే విధంగా మార్చాలని ప్రకటించి మొత్తాన్ని అర్హులైన బీసీలందరికీ అందజేయాలని డిమాండ్ చేసారు.ప్రజలు
కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ ల కొరకు అనేకమంది అర్హులు ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారని అన్నారు సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు..
 ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జానకిరాం,బిజెపి సీనియర్ నాయకులు వీరారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు మోనాచారి, రమేష్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బోయిని భీమయ్య ఓబిసి మోర్చ మండల అధ్యక్షులు గుడాల వెంకటేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *