షాద్ నగర్ ప్రజా తంత్ర జూలై 22: స్థానిక షాద్ నగర్ నుండి రాసుమల్లగూడ వెళ్లే దారిలో గత సంవత్సరం క్రితం బి.టి. రోడ్ నిర్మాణం జరిగినప్పటికీ ఆ గ్రామా ప్రజలు ఇబ్బందులు తీరలేదు. నాగులాపల్లి గ్రామం దగ్గర అదే గ్రామానికి కి చెందిన హెడ్డుకానిస్టేబుల్ గా పనిచేస్తున్న సత్యంరెడ్డి అనే వ్యక్తి తన బావి దగ్గర వివాదం సృష్టించి రోడ్డు నిర్మాణని అడ్డుకున్నారు. అంతే కాక కాల్వర్టు కోసం వేసిన పైపులను మట్టి రాళ్లతో పూడ్చారు.. దానివల్ల రోడ్డు నిర్మాణమే ఆగిపోకుండా కల్వర్టు లో మట్టి పోసిన కారణంగా రోడ్డుపై దాదాపు 5 ఫీట్ ల లోతుల్లో వర్షం నీరు నిలుస్తోంది. దీని కారణం గా గ్రామస్తుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో గ్రామానికి అంబులెన్స్ రాన్ని పరిస్థితి అయితే గ్రామంలో కొంతమంది యువకులు ఈరోజు అక్కడికి వెళ్లి కల్వర్టు కి అడ్డుగా పోసిన మట్టి రాళ్లను తొలిగించారు. కాబట్టి నాయకులు అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు చెవుల నాగభూషన్ , దొడ్డి మహేందర్ , చెవుల శ్రీశైలం , ఫిరంగి రామకృష్ణ, దొడ్డి శ్రీనివాస్,చెవుల శివకుమార్, చెవుల కుమార్,చెవుల శివనంద్, ఎత్తిన శ్రీశైలం,మరియు గ్రామస్తులు పాల్గొన్నారు



