టిప్పర్ ఆటోను ఢీకొని 6 గురు దుర్మరణం
సంత దినం కావడంతో భారీగా జనాలు
ఆటో, బైకును ఢీకొన్న డీసీఎం వాహనం
మృతులు మోతి ఘనాపూర్ బీహార్ వాసులు
మహబూబ్ నగర్ , ప్రజాతంత్ర, జనవరి 5: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లోని బాలనగర్ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. స్థానికుల పోలీసుల వివరాల ప్రకారం. వారంతా సంత దినం కావడంతో కూర గాయలు, సరుకుల కోసం వచ్చిన మోతి ఘనపూర్ తాండా వాసులతోపాటు బీహార్ కు చెందిన పలువురు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళుతుండగా డీసీఎం వాహనం అతివేగంగా అజాగ్రత్తగా ఢీకొంది.
ఈ సంఘటనతో 6 గురు అక్కడికక్కడే మృతిచెందగా బైక్ పై వెళ్తున్న మరొకరికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు స్థానికులు తెలిపారు. పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనలో చిన్న పిల్లలు సైతం ప్రమాదానికి గురై మృత్యువాత పడడంతో స్థానికులుచూసి బోరున విలపించారు. డీసీఎం వాహనం ను స్థానికులు అగ్రహం వ్యక్తం చేసి వాహనాన్ని నిప్పటించారు. ఈ సంఘటనతో 44 జాతీయ రహదారిపై వాహనాలు సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు బారులు తీసి ట్రాఫిక్ జామ్ అయ్యాయి.




