•ఓట్ల కోసం ఇచ్చే తాయిలాలకు బహుజనులు ఆశపడొద్దు
•ఎలక్షన్స్ ఫండు కోసమే ఆగమేఘాలమీద లిక్కర్ టెండర్లు
•లక్ష కోట్ల ప్రభుత్వ భూమి వేలం వేసి డబ్బు దన్నుకున్నారు
•విలేకరులపై కేసీఆర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
•బి.ఎస్.పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్.
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : బిజెపి, కాంగ్రెస్, బిఆరెస్ లో ఉన్న బహుజనులారా బహుజన సమాజ్ వాజ్ పార్టీ లోకి రండి అందరం ఏకమవుదాం అని బహుజన సమాజ్ వాజ్ పార్టీ(బి.ఎస్.పి) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ పిలునిచ్చారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ దొరల పాలన వల్ల బహుజనులు నష్టపోతున్నారని అన్నారు. బిసి వర్గాల నుండి 150 కులాలు ఉంటే కేవలం 6 కులాలకే టికెట్లు ఇచ్చిన కేసీఆర్ 23 సీట్లు మాత్రమే ఇచ్చారన్నారు. బహుజనులు మన బ్రతుకుల బాగుకోసం మనం ఆలోచించాలని అన్నారు. ఈ మేరకు బుధవారం లక్డీకపూల్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సంపేటకు చెందిన మదన్ కుమార్ బిఆరెస్ పార్టీ నుండి బి.ఎస్.పిలోకి పార్టీ కండువా కప్పి ప్రవీణ్ కుమార్ ఆహ్వానించారు. ఇది బహుజన సమాజ్ వాదీ పార్టీ సాధించిన మరో విజయం అన్నారు. అనంతరం ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దొరల పార్టీనుండి, దొరల జెండా మోస్తూ చాకిరి చేసిన బహుజనుడు బహుజనుల పార్టీకి రావడం సంతోషం అన్నారు. ఒక శాతం ఉన్న అగ్రవర్ణాల అధికారాన్ని చేపడుతుంటే 90 శాతం ఉన్న బహుజనులు ఎం చేయాలని మధన్ ఆలోచించడం శుభ పరిణామం అన్నారు. 99 శాతం ఉన్న మన కోసం మన పార్టీ బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. మనం అందరం ఒక తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. వంద కోట్ల లిక్కర్ స్కామ్ లో నిందితురాలు అయిన కవితను ముట్టుకోవడానికి సిబిఐ, ఈడీ భయపడుతున్నారని ఆన్నారు. అదే బహుజన గిరిజన బంజారా లక్ష్మీ భాయ్ ను చిత్రహింసలకు గురిచేస్తే ఎవరు మాట్లాడలేదన్నారు. డాక్టర్ తాటికొండ రాజయ్యకు టికెట్ రాకపోతే అంబెడ్కర్ విగ్రహం వద్ద వల వల ఎడుస్తున్నారని, అంబెడ్కర్ ఎం చెప్పిండో ఆయనకు తెలియదా అని అన్నారు. అంబెడ్కర్ ఆత్మ గౌరవంతో బోధించు, సమికరించు, ఆశించు అని జీవించమన్నాడని గుర్తు చేశారు. రాజయ్య అలా ఏడవకండని కోరారు. ఎలక్షన్ ఓట్ల కోసమే రైతు మాఫీ, లాంటి బిస్కెట్లు వేసి ఆకట్టుకుంటున్నారని అది ప్రజలు నమ్మొద్దన్నారు. మా పార్టీ ఎప్పుడు మీకు స్వాగతం పలుకుతుందని అన్నారు. బిజెపితో బిఆరెస్ రహస్యంగా ఒప్పందం చేసుకున్నారని అన్నారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.50 కోట్ల వరకు పెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని అన్నారు. బహుజనులు ఓట్ల కోసం ఇతర పార్టీవాళ్ళు ఇచ్చే తాయిలాలకు ఆశపడొద్దు అని కోరారు. కేసీఆర్ ఇప్పటికే ఒడినట్లు ఒప్పుకొని రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నారని అన్నారు. ఇంటిలిజెన్స్ లను అడ్డుపెట్టుకొని సర్వేలు చేయిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చిన కేసీఆర్ ను మళ్ళీ ఎన్నుకుంటే రాష్ట్రం ఆగం ఐతదని అన్నారు. అగమేగాలమిద లిక్కర్ టెండర్లు వేస్తున్నాడని, డిసెంబర్ వరకు సమయం ఉన్న ఇప్పుడే ఎందుకు వేలం వేస్తున్నారంటే ఆ డబ్బులు ఎలక్షన్స్ ఫండు కోసమే అని ఆరోపించారు. సిగ్గులేకుండా రిజర్వేషన్ పై సీట్లు పొందిన వాళ్ళు వెంటనే బిఆరెస్ కు రాజీనామా చేసి రావాలన్నారు. లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ భూమి వేలం వేసుకొని డబ్బులు దన్నుకుంటున్నారని ఆరోపించారు. విలేకరులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. జర్నలిస్టుల కు బహుజనుల సమాజ్ వాజ్ పార్టీ మద్దతుగా ఉంటుందన్నారు.


