బహుజనుల ఐక్యత కోరే ఏకైక పార్టీ బీఎస్పీ

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: బహుజనుల ఐక్యత కోరే ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయినీ చంద్రశేఖర్ ముదిరాజ్  ఆధ్వర్యంలో  పట్టణంలో తనదైన రీతిలో జోరుగా తన పార్టీ గుర్తు ప్రచారం చేశారు.కార్యక్రమంలో భాగంగానే కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ  బహుజనుల ఐక్యత కోరే ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ అని, కాబట్టి తాండూర్ లో నూతన రాజకీయానికి పునాదులు వేద్దామని  ప్రజలను కోరారు. తాండూర్ లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని మీరంతా నాకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ వికారాబాద్ జిల్లా మైనార్టీ కన్వీనర్ అంజాద్ అలీ పాష తాండూర్ అసెంబ్లీ ఇన్చార్జ్ దొరిశెట్టి సత్యమూర్తి తాండూర్ నియోజకవర్గం అధ్యక్షులు పి.అరుణ్ రాజ్ మరియు నియోజకవర్గ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *