బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక

జయంతి సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్‌ను స్మరించుకున్న సిఎం కెసిఆర్‌
‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్‌ ‌సర్వాయి పాపన్న గౌడ్‌ ‌ప్రతీకగా నిలిచారని సీఎం కేసీఆర్‌ ‌కొనియాడారు. సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. శుక్రవారం సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆయన కృషిని, పోషించిన చారిత్రక పాత్రను సీఎం స్మరించుకున్నారు. కుల, మతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కాలనే సమ సమాజ ప్రజాస్వామిక స్ఫూర్తితో ఆనాటి కాలంలోనే పాపన్నగౌడ్‌ ‌పోరాడడం గొప్ప విషయమన్నారు.

విశ్వకీర్తిని పొందిన పాపన్న గొప్పతనాన్ని స్మరించుకునేందుకు ప్రతి ఏటా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణ స్వయం పాలనలో సబ్బండ వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం లభించిందని, స్వరాష్ట్రంలో వేలాది మంది దళిత, బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దడం ద్వారా పాపన్నగౌడ్‌ ఆశయాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *