బండ్లగూడలో కాంగ్రెస్ పార్టీకి షాక్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 24: దశాబ్ది కాలంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నాయకులు శివ, చందు, ఆసీఫ్ లు 100 మంది మిత్ర బృందంతో కలిసి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ విజయానికి సైనికుల కృషి చేస్తామని వారు తెలిపారు. పార్టీలో చేరిన యువకులందరికీ సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. వీరితో పాటు బిజెపి పార్టీ సీనియర్ నాయకులు రాజు బిఆర్ఎస్ పార్టీ లో చేరారు.ఈ కార్యక్రమంలో హాజరైన మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీలు యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్, పార్టీ డివిజన్ అధ్యక్షులు అఫ్జల్, బండ్లగూడ అధ్యక్షులు గోపాల్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *