ఫోర్త్ ఎస్టేట్‌’’‌కు భంగం

రాజ్య పాలక వర్గాల తీరు
నియంతలను తలపిస్తుంది

ప్రజావ్యతిరేక విధానాలతో
రాక్షస ప్రవృత్తి చాటుతుంది

తమ ఏజెన్సీలను ఎగవేసి
పాత్రికేయులపై వేధింపులు
మీడియాపై మూక దాడితో
ప్రజల స్వేచ్ఛను హరిస్తుంది

ఇందుకు అంతర్జాతీయ
దిగ్గజ వార్త సంస్థ బీబీసీపై
సర్వే పేర దర్యాప్తు మూక
సాగించిన దాడులే సాక్ష్యం

గోద్రా ఆలర్ల వెనుక దాగిన
నేత నిజస్వరూపం తెలిపే
వీడియో ప్రసారం చేయడం
ఆ సంస్థ యొక్క పాపమట!

అందుకే సోదాల సోదులు
అనైతిక దాడుల ఫర్వాలు
పన్ను ఎగవేసే ఆరోపణలు
దోషిగా నిలిపే అబాండాలు
ఏకంగా ప్రశ్నించే కుత్తుకలపై
విష కత్తులు దువ్వె చర్యలు

నిబద్ధతకు ప్రతీకైనా సంస్థలే
పాలక వర్గాలకు భజన చేస్తే
పొర హక్కుల కాపాడేదెవరు?

రాజ్యాన్ని పాలించే నేతలే
కక్ష సాధింపులకు తెగబడితే
ప్రజాస్వామ్యం వర్దిళ్లేదెపుడు?

ఇకనైనా జనగణం మేలుకొని
అనైతిక వేధింపుల కట్టడిచేసి
ఫోర్ట్ ఎస్టేట్‌ ‌స్వేచ్ఛ కాపాడాలి

(బీబీసీ సంస్థపై పాలకుల వేధింపుల నేపథ్యంగా..)
– కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *