తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: ఇటీవల గుండెపోటుతో బషీరాబాద్ మండలానికి చెందిన ఫిజియోథెరపిస్ట్ మేరాజ్ హఠాత్ మరణం చెందిన విషయం తెలిసిందే, పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్బిఎల్ శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ సంపత్ కుమార్ లు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మేరాజ్ కుటుంబానికి మంగళవారం శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో మేరాజ్ కుటుంబ సభ్యులను కలిశారు. మేరాజ్ కుటుంబానికి తనతోపాటు డాక్టర్ సంపత్ కుమార్ ల తరపున 50 వేల నగదు ఆర్థిక సాయం కుటుంబ సభ్యులకు అందజేసి చేయూత నందించారు. అనంతరం ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకులతోపాటు కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకునే తత్వం కాంగ్రెస్ పార్టీ ది అని అన్నారు. ఫిజియోథెరపిస్ట్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫిజియోథెరపిస్ట్ మేరాజ్ కుటుంబానికి చేయూత





