ఫామ్‌హౌజ్‌ ‌కేసులో విచారణ

సిఎం కెసిఆర్‌ ఇచ్చిన ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటామన్న హైకోర్టు
హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 15(ఆర్‌ఎన్‌ఎ) : ‌టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. దీన్ని చూసి తదుపరి విచారణ చేపడతామని పేర్కొంది. గురువారం ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసు వీడియోలు, ఆడియోలు దర్యాప్తు దశలోనే లీక్‌ అవ్వడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. హై ప్రొఫైల్‌ ‌కేసులో దర్యాప్తు మధ్యలోనే ఆధారాలు ఎలా బయటికి వెళ్ళాయని అడిగారు. సిట్‌ ‌దర్యాప్తు సక్రమంగా లేదని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు.

ఈ కేసును లా అండ్‌ ఆర్డర్‌ ‌పోలీసులు కాకుండా ఏసీబీతో ఎందుకు విచారణ జరిపించలేదని పిటిషనర్‌ ‌తరుపున న్యాయవాది వాదించారు. మెట్రోపాలిటన్‌ ‌నగరాల్లో ఏసీపీ స్థాయి అధికారి పీసీ యాక్ట్ ‌కేసులను విచారించవచ్చని అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌కోర్టుకు తెలిపారు. అయితే 2003లో ఏసీపీ పరిధిని ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని…దాని ప్రకారం 2003 నుంచి నమోదైన పీసీ యాక్ట్ ‌కేసులన్నీ ఏసీబీనే విచారించాలని పిటిషనర్‌ ‌వాదించారు. అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని శుక్రవారం తుది వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *