ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో సిట్‌ ‌దర్యాప్తు వేగవంతం

రెండోరోజు సిట్‌ ‌విచారణకు హాజరైన ఆడ్వొకేట్‌ శ్రీ‌నివాస్‌

ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో సిట్‌ ‌దర్యాప్తు వేగవంతం చేసింది. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడంపై ఆరాతీస్తున్న అధికారులు ఆరోపణలు కేసుతో సంబంధం ఉన్న వారిని ప్రశ్నిస్తుంది. తాజాగా ఆడ్వొకేట్‌ శ్రీ‌నివాస్‌, ‌బీఎల్‌ ‌సంతోష్‌, ‌తుషార్‌, ‌జగ్గు స్వామిలను సోమవారం విచారణకు పిలవగా శ్రీనివాస్‌ ‌మినహా మిగిలిన ముగ్గురు గైర్హాజరయ్యారు. దీంతో అధికారులు పరారీలో ఉన్న జగ్గు స్వామిపై లుకౌట్‌ ‌నోటీసులు జారీ చేశారు. ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసుకు సంబంధించి జగ్గు స్వామికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆయన అందుబాటులోకి రాకపోవడంతో కేరళలోని ఓ ఆశ్రమ ప్రతినిధులకు నోటీసులు ఇచ్చారు.

తాజాగా విచారణకు ఆయన గైర్హాజరుకావడంతో సిట్‌ ‌లుకౌట్‌ ‌నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో భాగంగా సిట్‌ ఈ ‌వ్యవహారంతో సంబంధమున్న వారందరినీ ప్రశ్నిస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం నలుగురిని విచారణకు పిలవగా ఆడ్వొకేట్‌ శ్రీ‌నివాస్‌ ఒక్కరే హాజరయ్యారు. విచారణలో భాగంగా ఆయనను కొన్ని గంటల పాటు ప్రశ్నించిన అధికారులు మంగళవారం కూడా సిట్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు.

రెండోరోజు సిట్‌ ‌విచారణకు హాజరైన ఆడ్వొకేట్‌ శ్రీ‌నివాస్‌
‌ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో సిట్‌ ‌దర్యాప్తులో భాగంగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆడ్వొకేట్‌ శ్రీ‌నివాస్‌ ‌రెండోరోజు మంగళవారం విచారణకు హాజరయ్యారు. కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌లో శ్రీనివాస్‌ ‌విచారణ కొనసాగింది. సోమవారం విచారణలో భాగంగా సిట్‌ అధికారులు అడిగిన వివరాలతో ఆయన హాజరయ్యారు. మొబైల్‌ ‌ఫోన్‌, ‌బ్యాంక్‌ ‌స్టేట్‌మెంట్‌ను సిట్‌కు సమర్పించారు. వాటి ఆధారంగా అధికారులు శ్రీనివాస్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తుంది. సోమవారం సైతం సిట్‌ ఆయనను 8 గంటల పాటు ప్రశ్నించింది. ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసుకు సంబంధించి సిట్‌ అడ్వొకేట్‌ శ్రీ‌నివాస్‌, ‌బీఎల్‌ ‌సంతోష్‌, ‌తుషార్‌, ‌జగ్గు స్వామిలను సోమవారం విచారణకు పిలిచింది. అయితే శ్రీనివాస్‌ ‌మినహా మిగిలిన ముగ్గురు విచారణకు గైర్హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *