షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 19: షాద్నగర్ నియోజకవర్గం లోని ఫరూఖ్ నగర్ మండలలోని లింగారెడ్డి గూడ, దూస్కల్, బుచ్చి గూడ, కొండన్నగూడ, వెంకన్న గూడ,
వెల్ జెర్ల,
కొత్తూరు మండలం లోని YM తాండ, సిద్దాపూర్, SB పల్లి, కోడిచర్ల, పెంజర్ల, ఇన్ముల్ నర్వ రంగాపూర్, మేకగూడ తదితర గ్రామాల్లో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు పర్యటించి కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతా త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న సందర్బంగా నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉండాలని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు నన్ను ఎంతో ఆదరించారని అన్నారు.
ఎన్నికల్లో గెలుపోటములు సహజం కాబట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ద్రుష్టి పెట్టాలని కోరారు.
ఈయొక్క కార్యక్రమం లో ఇస్నాతి శ్రీనివాస్, లష్కర్ నాయక్, మోహన్ సింగ్, చేగు సుధాకర్, యాదయ్య, జగన్ రెడ్డి, రాఘవేందర్, అశోక్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, పాపిరెడ్డి, మల్లారెడ్డి, శివ, చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.





