మరణం లేని చలం
మండుతున్న ఇనగోళం
శశిరేఖ క్రాంతి రేఖలు
దైవమిచ్చిన భాగస్వామి
అనుబంధాలు
అందమైన మైదానం
వెన్నెల పరుచుకున్న మైదానం
కోరికలు గుర్రాలై
పరుగులు తీసే మైదానం
అదొక స్వేచ్ఛ
అదొక భావ స్వేచ్ఛ
ఓ పువ్వు కొత్త లోకపు
ఆత్మీయత లోకి…
చూపు చూపు లో
తన్మయత్వం
వివిధ కోణాలు
అవి కొందరికి
మన్మథ బాణాలు
మరికొందరికి
సాంప్రదాయ శరాలు…
ప్రేమ లేని విశ్వం లేదు
మిథునం లేని ప్రకృతి లేదు
చలం లేకుండ
తెలుగు సాహిత్యం లేదు
చలం అంటే అనల చలనం
చలం అంటే ప్రేమ పవనం
-రేడియమ్
9291527757





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల