ర్యాబీస్ అనేది ఒక వైరస్ వల్ల సంభవించే ఒక వ్యాధి, ఇది వ్యాధి సోకిన జంతువు యొక్క లాలాజలం ద్వారా వ్యాపి స్తుంది. ర్యాబీస్ వ్యాధిని వ్యాపింపజేయు అనేక వాహకాలు ఉన్నాయి -ఎక్కువగా కుక్కలు మరియు గబ్బిలా లు. వైరస్ ఒక కాటు ద్వారా లేదా వ్యాధి సోకిన జంతువు యొక్క లాలాజలం ఒక గాయం కలిగిన చోట తాకినా సంక్రమించ వచ్చు. ఒకసారి సంక్రమించి నప్పుడు, వైరస్ శరీరంలో ప్రవేశిస్తుంది మరియు నాడీ వ్యవస్థపై దాడి చేసి కోమాకు దారి తీస్తుంది మరియు సరియైన చికిత్స చేయకపోతే చివరకు మరణానికి దారి తీస్తుంది. ర్యాబీస్లో రెండు రకాల ఉన్నాయి – అధిక కోపం మరియు పక్షవాతం. ర్యాబీస్ యొక్క ప్రధాన లక్షణాలు కాంతి కి తట్టుకోలేక పోవడం, నొప్పి, కండరాల స్పందనలు, చొంగ కార్చడం (అధిక – లాలాజలం, నీటిని చూసి భయపడటం. వ్యాధి యొక్క తదుపరి దశలలో, పక్షవాతం, కోమా సాధారణంగా సంభవిస్తాయి. ప్రపంచంలోని అనేక దేశాలలో రాబిస్ ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా మిగిలి పోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 18 నిర్లక్ష్యం చేసిన ఉష్ణమండల వ్యాధులలో ఇది ఒకటిగా జాబితా చేయబడింది. రాబిస్ దాదాపు ఎల్లప్పుడూ ప్రాణాంత కం. ఇది ఏదైనా వ్యాధి యొక్క అత్యధిక మరణాల రేటులో ఒకటి. ఏదేమైనా, రాబిస్ 100% నివారించ దగినది. క్రూరమైన కుక్క కాటు వలన సంభవించే మానవ మరణాల లో 99% పైగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో జరుగు తున్నాయి.
59,000 మంది ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా వ్యాధి వల్ల మరణిస్తున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, యునై టెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యుఎస్డిఎ)తో సహా ప్రధాన ఆరోగ్య సంస్థలు, ప్రపం చ ఆరోగ్య సంస్థ, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యాని మల్ హెల్త్ , ఐక్యరాజ్య సమితి యొక్క ఆహార మరియు వ్యవసాయ సంస్థ, 2030 నాటికి కుక్కల ద్వారా వ్యాపించే రాబిస్ నుండి మానవ మరణాలను తొలగిస్తా మని ప్రతిజ్ఞ చేశారు. రేబీస్ ను పిచ్చికుక్క వ్యాధి, జలభీతి వ్యాధి అని కూడా అంటారు. ఇది క్షీరదాలకు చెందిన జంతువుల నుండి జంతువులకు వ్యాపించే ఒక వైరల్ వ్యాధి. ఉదాహరణకు కుక్కలు, నక్కలు, తోడేళ్లు, పిల్లులు, ఎలుగు బంట్లు, కోతులు, తదితర కార్నివరస్ తదితర జబ్బుతో ఉన్న జంతువు మనిషికి కరిచినచో ఈ వ్యాధి మనుషులలో వ్యాప్తి చెందును. జంతువులలో నైనా, మనుషులలో నైనా ఈ వ్యాధి కనిపిస్తే చని పోవడము తప్ప మందులేదు. పిచ్చికుక్క కరిచిన వెంటనే టీకాలు (వ్యాక్షిన్) వేసుకుంటే ప్రమాదమేమీ ఉండదు. నూటికి నూరుపాళ్లు సురక్షితము.
రేబిస్ నరాలకు, మెదడుకు సంబంధించిన వ్యాధి. మెదడులో ‘ఎన్-సెఫలైటిస్’ అనే ఇన్ఫ్లమేషన్ లక్షణాలను కలుగజే యును. మిగతా ఏ వైరస్ వ్యాధి వలనైనా ఈ ఎన్-సెఫలైటిస్ లక్షణాలు కనిపించ వచ్చును. హెర్ఫీస్ వైరస్, ఎంటిరో వైరస్, ఆర్బో వైరస్, ముఖ్యముగా హెర్పెస్ సింప్లెఁ్ టైప్ 1, వేరిసెల్లా జోస్టర్, మొదలగునవి. కొన్ని లేబొరేటరీ పరీక్షల వలన తేడాను కనిపెట్టాలి. ఏ క్షీరదమైనా, మానవులతో కలిపి ఈ వ్యాధికి గురి కావచ్చును. ఈ వైరస్ ఉన్న జంతువు ఇతర జంతువులను, మనుషులను కరడం వలన ఒకరి నుండి ఇంకొకరికి ఈ వ్యాధి వ్యాపిం చును. కొన్ని సమయాలలో గాలిలో ఈ వైరస్ ఎగిరి వ్యాపించే అవకాశమూ ఉంది. గబ్బిలాలు కరడం ద్వారానే ఈ జబ్బు సోకే అవకాశము చాలా ఎక్కువ. మనుషుల నుండి మనుషులకు కరుచుట వలన, కొంతమేరకు చర్మం లేదా కార్నియా ట్రాన్స్ – ప్లాంటేషన్, ముద్దుల వలన వ్యాపించే అవకాశమూ ఉంది.
జబ్బుతో బాధ పడుతున్న ఏ జంతువైనా మనుషులకు కరిస్తే రేబీస్-వైరస్ బాహ్య నాడీ మండలము ద్వారా కేంద్రనాడీ మండలం చేరి వ్యాధి లక్షణాలు కలుగ జేయును. ఇలా జరుగ డానికి పట్టే కాలము 9 రోజుల నుండి 90 రోజులలో జరుగును, దీనినే ఇంకుబేషన్ కాలము అంటాము. మన శరీరము పై మెదడుకు ఎంత దగ్గరగా కరిస్తే అంత తొందరగా వ్యాధి మెదడుకు చేరే అవకాశ ముంది. గాభరాగా ఉండడం, తికమక పడడం మితిమీరిన భయము, భయంకర మైన చూపు, తనదైన లోకములో విహరించ డం, నోటి వెంబడి లాలాజలం కారడం, గొంతు నొప్పి, ఏమీ మింగలేక పోవడం, నీటిని, ద్రావకాలను చూస్తే భయ పడడం. ఈ లక్షణాలు ముదిరి, గొంతు కండరాలు పెరాలసిస్ కి గురియై మనిషి ఏమీ తినలేక కోమాలోకి పోయి చని పోవును. జబ్బు లక్షణాలు కనిపించిన 2 నుండి 10 రోజులలో చని పోవును. ఒక వేళ అరుదుగా బ్రతికినా మెదడు దెబ్బతిని పిచ్చి వాడుగా బ్రతుకును.
మనుషుల లోను, జంతువుల లోను ఈ వ్యాధి రాకుండా టీకా మందు వేసుకొని కాపాడు కోవచ్చు. 1885 లో లూయీస్ పాచ్చర్, ఇమిలె రౌక్స్ ఈ వాక్షిన్ ని కనుగొన్నారు. దీనిని •=• అంటాము. దీనిని మొదట 9 సంవత్సరాల బాలుని (జోసెఫ్ మైస్టర్) పై 1885 జూలై 06 లో ఉపయోగించారు. రేబిస్ వైరస్ క్రిములను జంతువుల (గొర్రె) మెదడు కణాలలో ప్రయోగ శాలలో పెంచి వాటిని నిర్జీవము చేసి శుద్ధిచేసి తగినటువంటి ద్రావకములో నిలువచేసి సుబ్కుటేనియస్ గా ఇంజక్షన్ చేస్తారు. ఈ పాత వాక్షిన్ వల్ల పోస్టు వాక్షినేషన్ ఎన్కెఫలైటిస్ అనే సీడు ఎఫక్ట్ ఊన్నందున రాను రాను హూమన్ డిప్లోయిడ్ సెల్ వాక్షిన్ 1967 లో తయారవడం మొదలైనది. తరువాత చిక్ ఎంబ్రియో, డక్ ఎంబ్రియో, ఆ తరువాత వెరో సెల్ కల్చర్ ద్వారా కోతి మూత్రపిండాల కణాల కల్చర్ ద్వార, పూరిఫైడ్ వెరోసెల్ రేబిస్ – వాక్షిన్ తయారవు తుంది.
ఎక్కువగా పెంపుడు జంతువులతో గడిపే వారు, పశు వైద్యులకు, పశువైద్య సిబ్బందికి, జంతు ప్రదర్శన శాలలో పనిచేసే వారికి రేబిస్ ఎక్కువగా వున్న ప్రదేశాలలో తిరిగేవారికి ఇవ్వాలి. వీరోసెల్ కల్చర్ వాక్షిన్ 1వ,7వ,14వ రోజులలో 3 వాక్షిన్లు తీసుకొని, ప్రతి సంవత్సరము 1 డోసు బూస్టర్ డొసుగా తీసుకోవాలి. ఇలా చేయడం వలన ఎటు వంటి ప్రమాదము ఉండదు. ఈ కుక్క కాటు (ఏ జంతువైనా సరే) మూడు రకాలు మైల్డ్, మోడరేట్, సివియర్. ఏది ఏమైనా కరిచిన చోట సబ్బుతో బాగా కడగాలి, యాంటిసెప్టిక్ లోషన్ రాయాలి. గాయము బాగా ఎక్కువైనా కుట్లు వేయ కూడదు, వేసితే వైరస్ క్రిములు కుట్లు లోపల ఉండిపోయి జబ్బు ఎక్కువ అవడానికి ఆస్కార ముంటుంది. రోజూ క్లీనింగ్ చేసుకోవడం మంచిది. సివియర్ కాటు అయితే గాయము చుట్టూ పాసివ్ వాక్షిన్ ఇంజక్షన్ చేయాలి. నొప్పి తగ్గడానికి డాక్టర్ సలహా మేరకు నొప్పిని తగ్గించే మాత్రలు వాడాలి. గాయము చీము పట్టకుండా యాంటి బయోటిక్సు వాడాలి. వాక్షిన్ ఇచ్చే ముందు ఆయా జంతువులు 10 రోజులు నిజముగా రేబిస్ అయినదో కాదో పరిశీలనలో వుంచాలి. ప్రస్తుతం మార్కెట్ లో 5 నుండి 6 రకాల వాక్షిన్లు దొరుకు తున్నాయి. కుక్క పిచ్చి ప్రవర్తన చూడాలి. సొంగ కార్చు చున్నదేమో చూడాలి. గజ్జి వగైరా వున్నాయేమో చూడాలి. పెంచిన కుక్కా, వూర కుక్కా అడిగి తెలుసుకోవాలి. తెలిసి ప్రతి పిచ్చి కుక్క కాటుకి పూర్తి కోర్సు ఇంజక్షన్లు వేసుకోవాలి.
వాక్షిన్ తీసికోని కేసులలో రేబీస్ వ్యాధి పూర్తిస్థాయిలో వచ్చి మనిషి చనిపోవును. ఈ వ్యాధికి చికిత్స లేదు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494




