ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

వార్ రూంలకు చేరిన ఈవిఎంలు
ఈవిఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల – భవితవ్యం
అభ్యర్థుల విజయావకాశాలపై ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,డిసెంబర్ 1 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి.గత రెండు మూడు నెలలుగా ఎన్నికలు ఎలా జరుగుతాయని ఉత్కంఠలో అధికారులు,పలు పార్టీల నాయకులు,స్వతంత్ర అభ్యర్థులు,పోలీసు ఉన్నతాధికారులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన చివరకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బిఆర్ఎస్ పార్టీ తరపున మంచిరెడ్డి కిషన్ రెడ్డికి టికెట్ ఖరారు చేసి బీఫామ్ ఇవ్వడంతో ఆయన నియోజకవర్గంలో పలు దఫాలుగా ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం టికెట్ ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు అన్న మీ మాంసంలో పడి ఎన్నికలు సమీపిస్తున్న వేళలో చివరకు మల్ రెడ్డి రంగారెడ్డికి టికెట్టు ఖరారు చేశారు.ఈ నేపథ్యంలో ఆయన కూడా కాస్త ప్రచారంలో వెనుకబడ్డ చివరకు నువ్వా నేనా అన్న చందంగా ప్రచారం నిర్వహించారు.బిజెపి అధిష్టానం దయానంద గౌడ్ కు టికెట్ కేటాయించిన ప్రచారంలో అంత దూకుడు కేటాయించలేదని వినిపించిన గురువారం జరిగిన ఎన్నికల్లో మాత్రం ముగ్గురు అభ్యర్థులకు ఓటర్లు ఓటు వేసినట్టు సమాచారం.ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమై రాత్రి 8 గంటల పైచిలుకు మేరకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది.అనంతరం ఈవిఎంలను స్టోర్ రూమ్ల వద్దకు భారీ భద్రత నడుమ తరలించారు.అభ్యర్థులు ఎవరన్నది పక్కన పెడితే వారి భవిష్యత్తును మాత్రం ఈవిఎంలలో నిక్షిప్తమైనాది.ఆదివారం మూడవ తేదీన వారి భవితవ్యం తేలనుంది. ఇబ్రహీంపట్నంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్ నుండి మల్ రెడ్డి రంగారెడ్డి,బిఆర్ఎస్ నుండి మంచిరెడ్డి కిషన్ రెడ్డి,బిజెపి పార్టీ నుండి దయానంద్ గౌడ్ లు ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రచారంలో మాత్రం కాంగ్రెస్,బిఆర్ఎస్ పోటీపడి ప్రచారం నిర్వహించాయి.ఒకానొక క్రమంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో ర్యాలీలో భాగంగా తారాసపడ్డ ఇరు పార్టీల నాయకులు,కార్యకర్తలు నినాదాలు చేస్తూ గొడవలకు దిగి పెద్ద రచ్చ చేసుకున్నారు.ఈ నేపథ్యంలో జిల్లాలో నియోజకవర్గంలో ఎన్నికల అధికారులు పోలీసు యంత్రాంగం ప్రతిక్షణం వారిపై నిఘా పెడుతూ ఎన్నికలవేళ ర్యాలీలు,ప్రచార కార్యక్రమాలు, ఇంటింటి ప్రచారాలు సైతం నిఘా నీడలో జరిగాయి.గురువారం జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు ప్రతి ఒక్కరు ఓటు వేసుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి సైతం వచ్చి తమ తమ ఓటు హక్కును సైతం వినియోగించుకున్నారు.ఈ నియోజకవర్గంలో 2018లో 76.39% ఓట్లు పోలవగా 2023లో 63.70% పోల్ అయ్యాయి.గతంలో కంటే దాదాపు పది శాతం పైబడి ఓట్ల శాతం తగ్గిందని అధికారులు తెలియజేశారు. నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కలిపి 3,27,583 ఓటర్లు ఉండగా అందులో యాచారం మండలంలో 47,948 ఓట్లు, మంచాల మండలంలో 4018 ఓట్లు, ఇబ్రహీంపట్నంలో 72 వేల 65 ఓట్లు, అబ్దుల్లాపూర్మెట్ లో 1,67452 ఓట్లు ఉన్నాయి.ఇందులో భాగంగా నియోజకవర్గంలో 319 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో ఆయా మండలాలకు చెందిన ఓటర్లు ఓటు ప్రక్రియ ద్వారా ఓట్లు వేశారు.ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి కానీ ఈ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎవరు అవుతారు ఎవరు ఓడిపోతారు అని సందేహాలు మాత్రం ఓటర్లలో కాకుండా ముఖ్యంగా పోటీ చేసిన అభ్యర్థుల అనుచర గణంలో కార్యకర్తల్లో ఉత్కంఠ మొదలైంది.మూడవ తేదీన జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపులో వారి భవితవ్యాలు తేలలున్నాయి.సర్వేలు మాత్రం అన్ని కాంగ్రెస్ వైపే ముగ్గు చూపుతుండగా సర్వేలు నమ్మలేని పరిస్థితిలో ఉన్నాయని అధికార పార్టీకి చెందిన బిఆర్ఎస్ నాయకులు తెలియజేస్తున్నారు.సర్వేలు కాదు ముఖ్యం. ప్రజలపై విశ్వాసం ఉందని బిఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు సైతం విశ్వాసం వ్యక్తం చేస్తున్నారంటే పోటీ ఎంత రసవత్తరంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో ప్రజల్లో చైతన్యం పెరగడంతో పాటు ఓటింగ్లో అందరూ ప్రశాంతంగా పాల్గొని ఓటు వేయడం ద్వారా రానున్న యువ సమాజానికి,సమాజానికి ఒక మంచి సమాచారం అందించారని పలువురువిశ్లేషకులుఅభిప్రాయపడుతున్నారు. సైలెంట్ గా ఉన్న ఓట్లు ఎవరి వైపు మొగ్గు చూపుతోందని ఎవరి ఓటమి గెలుపులు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయనే  అభిప్రాయాలు కూడా ఇబ్రహీంపట్నంలో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *