- కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం..అండగా సీఎం కేసీఆర్
- ధన్యవాదాలు తెలిపిన కుటుంబ సభ్యులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : ప్రఖ్యాత ఫోటో జర్నలిస్టు, చిత్రకారుడు, దివంగత భరత్ భూషణ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. భరత్ భూషణ్ కుటుంబానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కె. తారక రామారావు హైదరాబాద్‌లోని జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి ఆదుకున్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన వారి కుటుంబానికి తానున్నానంటూ రాష్ట్ర ప్రభుత్వం భరోసానిచ్చింది.
గతంలో, భరత్ భూషణ్ తీవ్ర అనారోగ్యంతో భాధపడుతున్నప్పుడు వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి ఆరోగ్య నిధి నుండి ప్రభుత్వం చేయూతనందించింది. కాగా…తమను కష్టకాలంలో ఆదుకుంటూ, ఇప్పుడు తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి మరోసారి అండగా నిలిచినందుకు భరత్ భూషణ్ భార్య సుభద్రమ్మ, వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.



