వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2: ప్రభుత్వం అందించే సహాయక పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం మహిళ, శిశు, వికలాంగులు, వయో వృద్ధులు, ట్రాంజెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా సెలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ… ఏప్రిల్ 2022 -23 సంవత్సరంలో సహాయ పరికరాల కోసం అర్హులైన దివ్యాంగుల దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేయడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా ఐదు రకాల సహాయ పరికరాలు జిల్లాకు మంజురు అయినందున జిల్లా ఎంపిక కమిటీ దివ్యాంగుల విద్య, దివ్యంగా లోపం శాతాన్ని బట్టి జిల్లా స్థాయి ఎంపిక కమిటీ అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. జిల్లాకు మంజూరైన 10 రిట్రో ఫిట్టర్ మోట్రైజెడ్ వెహికిల్స్ , 8 బ్యాటరీ వీల్ చైర్స్, 5 లాప్ టాప్ లు, 13 ఫోర్ జి స్మార్ట్ ఫోన్స్, 1 డైజి ప్లేయర్స్, 19 ట్రై సైకిల్స్ , 3 వీల్ చైర్స్, 37 ఊత కర్రలు, 13 వినికిడి పరికరాలు, 15 వాకింగ్ స్టిక్స్, 3 స్మార్ట్ కేన్స్, 8 టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హతల మేరకు ఎంపిక చేసి రాష్ట్ర కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సహాయక పరికరాలు వచ్చిన పిదప అర్హులైన దివ్యాంగులకు పంపిణీ చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. లలిత కుమారి, డి ఆర్ డి ఓ అడిషనల్ పిడి నర్సింలు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి పల్వన్ కుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మేఘా గాంది, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ వెంకటేష్ పాల్గొన్నారు.


