కీసర, ప్రజాతంత్ర , డిసెంబర్ 14 : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టాలని దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు సుమేష్ మోహన్ కోరారు. గత ప్రభుత్వ హయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటోను పెట్టిన విధంగానే ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటోను ఏర్పాటు చేస్తామని అన్నారు. కార్యాలయాల్లో ఫోటోను పెట్టడం వల్ల పేద ప్రజలకు ముఖ్యమంత్రి తెలియడంతో పాటు ప్రజా భవన్ లో జరుగుతున్న ప్రజావాణిలో తమ సమస్యలను ముఖ్యమంత్రి కి చెప్పుకునే అవకాశం ఉందని అన్నారు.




