ఓ వోటరన్నా!
మళ్లీ వోట్ల పండగ వచ్చేసిందిగా.
మమతల మధురిమలు కురిపిస్తూ
మాటల మధువుల్లో ముంచెత్తుతూ
వలపు పిలుపులతో మురిపించి మైమరిపించి,
మనసుదోచే మమతల మాలికలల్లే
రాజకీయ మాయలోళ్లు
గడప గడపకు వచ్చేస్తున్నారు
జాగ్రత్త…జర జాగ్రత్త.
ఆచరణలో
ఆకృతులన్నీ వికృతరూపాలైనా
మాటలలో సుందరస్వప్నాలు ఒలకపోసి,
నీ మనసుని ఆశల గేలానికి చిక్కించి,
నీ కనుల లోగిళ్ళలో ఆనందపు జల్లులు
కురిపించే మాయలోళ్లు వీళ్ళు.
వీళ్ళ మాటలు నమ్మి
కాలనావ సాగుతున్న వేళ
క్షణమొక యుగమై, దినదిన గండమై,
పొగిలి పొగిలి ఏడవగా కనులు
జీవనదులై సాగే జలపాతాలయ్యేలా చేసుకోకు నీ భవితను.
తడిలేని ఎదలతో
మానవత్వం మసిబారుతున్న వేళ
చైతన్యం కలిగిన మనసుతో
వివేకవంతుడవై మసలుకో.
కల్మషాలకు దూరంగా
క్షణాలు ఆనంద వీక్షణాలుగా,
దినాలు
సంతసాల పర్వదినాలుగా మలిచే,
నాయకులనెన్నుకో.
నీ రేపటి తరానికి,
స్పూర్తి కిరణాల వెలుగులు పంచు!
ప్రభాతాల వెలుగులవైపు
అడుగులు వేయి…..
ఇంతకీ మీలో అసలెవరు..
నకిలీ ఎవరు..?
పట్టభద్రులెవరు..నిసానీ ఎవరు?
అబద్దాల పుట్టభద్రులు చేరారట.
– వేమూరి శ్రీనివాస్,
9912128967, తాడేపల్లిగూడెం.




