ప్రత్యేక తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యి పదేళ్లు గడిచిన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రాల ఫిల్మ్ ఇండస్ట్రీని నుంచి తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీగా వేరు చేసి ప్రత్యేక టెలివుడ్ ఇండస్ట్రీగా ఏర్పాటు చేయాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి నియోజకవర్గ ఇంచార్జి ఆర్.కే.దిలీప్ కుమార్ రాథోడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ విభజన అయినప్పటికి ఇప్పుడు వరకు టాలీవుడ్ ఇండస్ట్రీని విడదీయలేదన్నారు. టాలివుడ్ ప్రముఖుల దగ్గర నుండి కెసిఆర్ ప్రభుత్వం ప్యాకేజీ తీసుకొని విడదీయకుండా చేసాడని ఆరోపించారు. దాని వలన చాల మంది నష్టపోతున్నారని చెప్పారు. కేసిఆర్ ప్రభుత్వం సొంత ప్రయోజనం కోసం ఒకే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఇన్ని వేల కోట్లు చేసి వాడుకున్నారని అన్నారు. మాజీ సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ చేసి కాంట్రాక్టులకు లబ్ది చేసే విధంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కాంట్రాక్టు మేఘ శరత్ సాగర్ కి ఇచ్చి తమకి లబ్ది చేకూర్చుకున్నారని ఆరోపించారు. తెలంగాణకు జరిగిన నష్టాన్ని పూడ్చే విధంగా విచారించి ఈ ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిని బట్టబయలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి జీనత్ బేగం, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి మహ్మద్ అబ్దుల్లా, పార్టీ సభ్యులు సయ్యద్ మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *