పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: బల్దియా పరిధిలోని డివిజన్ల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మాణిక్య ప్రభు మందిరం సమీపంలో 26 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



