‌ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిన బిజెపి

  • దేశరాజకీయాలు వేగంగా మారుతున్నాయి
  • తెలంగాణ కోసం సోనియా ఐదు గ్యారెంటీలు
  • 17న స్వయంగా ప్రకటిస్తారన్న పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి
  • కాంగ్రెస్‌లో చేరిన ఇల్లంతకుంట నేతలు….కండువాలు కప్పి ఆహ్వానించిన రేవంత్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5 : ‌దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రమాదం అంచున నెట్టేసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. దేశ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నా యని, సెప్టెంబర్‌ 17‌న ఐదు గ్యారంటీలను ప్రకటించాలని కాంగ్రెస్‌ అ‌గ్ర నాయకురాలు సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి  పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన గాంధీభవన్‌లో వి•డియాతో మాట్లాడుతూ మన విజ్ఞప్తి మేరకు సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.  మనమంతా 16, 17, 18 ఈ మూడురోజుల కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపిచ్చారు. బుధవారం సాయంత్రం కేసీ వేణుగోపాల్‌  ‌వొచ్చి ఏర్పాట్లపై సవి•క్ష నిర్వహిస్తారన్నారు.

17వ తేదీ సాయంత్రం పరేడ్‌ ‌గ్రౌండ్లో 10 లక్షల మందితో గొప్ప బహిరంగ సభ నిర్వహిద్దామన్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే సభలో సోనియా గాంధీ 5 గ్యారంటీలను ప్రకటిస్తారని తెలిపారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్‌  ‌దేశానికి గొప్ప సందేశాన్ని ఇవ్వనుందని, పరేడ్‌ ‌గ్రౌండ్‌లో సభకు అనుమతి కోసం సెప్టెంబర్‌ 2‌న డిఫెన్స్ ‌వారికి లేఖ ఇచ్చామని రేవంత్‌ ‌రెడ్డి చెప్పారు. కానీ పరేడ్‌ ‌గ్రౌండ్‌ ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌, ‌బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. పరేడ్‌ ‌గ్రౌండ్‌లో సభ పెడతామంటూ కిషన్‌ ‌రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో తీర్మానం చేసి ఈ కుట్రను తిప్పికొట్టాలన్నారు. ప్రభత్వమే కుట్రదారుగా మారడం దారుణమన్నారు. ఎస్పీజీ భద్రత ఉన్న నేతలు వచ్చినప్పుడు విజ్ఞతతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు.

రెండవ అప్షన్‌గా ఎల్బీ స్టేడియంను అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. అయినా బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ కుట్ర చేసి అనుమతి ఇవ్వకున్నా.. కార్యక్రమం వాయిదా వేసేది లేదని, ఔటర్‌ ‌బయట కూడా సభను ఏర్పాటు చేసుకోవడానికి కార్యాచరణ తీసుకోవాలన్నారు. 17న సోనియా గాంధీ ఇచ్చే 5 గ్యారంటీలను 18వ తేదీ నుంచి ప్రజలకు వివరించే కార్యక్రమం తీసుకుంటున్నామన్నారు. 119 నియోజకవర్గాల్లో 119 మంది కీలక నేతలు ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తారని రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌ ‌పరేడ్‌ ‌గ్రౌండ్‌పై బీజేపీ, కాంగ్రెస్‌ ‌మధ్య రాజకీయం నడుస్తోంది. సభ కోసం ఈ రెండు పార్టీలు పర్మిషన్‌ ‌కోరాయి. ప్రస్తుతానికి ఏ పార్టీకి ఈ గ్రౌండ్‌ ‌కేటాయింలేదు. కానీ రెండు పార్టీల మధ్య డైలాగ్‌ ‌వార్‌ ‌నడుస్తోంది. తాజాగా ఇదే అంశంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి  స్పందించారు. గాంధీ భవన్‌లో ఆయన వి•డియాతో మాట్లాడారు. పరేడ్‌ ‌గ్రౌండ్‌ను ముందుగా కాంగ్రెస్‌ ‌పార్టీ అడిగిందని తెలిపారు. పరేడ్‌ ‌గ్రౌండ్‌ ఒక్కటే వుందా? హైదరాబాద్‌లో ఇంకా గ్రౌండ్‌లు ఉన్నాయని బీజేపీకి  సూచించారు. సీడబ్ల్యూసీ సమావేశం, సభ ఏర్పాట్లను పార్టీ నేతలు పరిశీలిస్తున్నారని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన ఇల్లంతకుంట నేతలు….కండువాలు కప్పి ఆహ్వానించిన రేవంత్‌
‌రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో పలువురు నేతలు కాంగ్రెస్‌ ‌లో చేరారు. టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ ‌పార్టీలో మంగళవారం చేరారు. వలసలతో కార్యర్తల్లో జోష్‌ ‌పెరిగింది. మండల మాజీ ఎంపిపి గుడిసే అయిలయ్య యాదవ్‌ ‌తో పాటుగా, జవారిపేట సర్పంచ్‌, ‌రేపాక, పెద్దలింగాపూర్‌ ఎం‌పిటిసిలు పార్టీలో చేరారు. ఈ సంధర్భంగా రేవంత్‌రెడ్డి తన నివాసంలో మానకొండూర్‌ ఇం‌చార్జ్ ‌డాక్టర్‌ ‌కవ్వంపెల్లి సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు భూంపెల్లి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులకు కాంగ్రెస్‌ ‌కండువా కప్పి ఆహ్వానించారు.

పార్టీలో చేరిన వారిలో జవారిపేట సర్పంచ్‌ అన్నాడీ కరుణరవీందర్‌రెడ్డి, రేపాక , పెద్దలింగాపూర్‌ ఎం‌పిటిసిలు కాతసుమలత మల్లేశం, కరివేద స్వప్నకర్ణాకర్‌రెడ్డి, డైరెక్టర్‌ ‌చల్లనవీన్‌, ‌నాయకులు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ముక్కీస కేశవరెడ్డి, అనగోని యాదగిరి గౌడ్‌ ‌తో పాటుగా పలువురు నాయకులు కాంగ్రెస్‌ ‌పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షుడు పసుల వెంకటి, ఒగ్గుదామోదర్‌,‌రత్నాకర్‌రెడ్డి, పాశంరాజేందర్‌రెడ్డి, సాగర్‌,‌తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *