ప్రజాసేవ చేయడానికి రాజకీయంలోకి వచ్చా

ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 12 : ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయంలోకి వచ్చానని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం జంగారెడ్డి పల్లి గ్రామంలో గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.6 లక్షలకు సంబంధించిన సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అదేవిధంగా హనుమాన్ ఆలయ నిర్మాణానికి సంబంధించి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.50, వేల నగదును కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మండ్లి రాములు, పట్టణ అధ్యక్షులు మానయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజశేఖర్, గ్రామ అధ్యక్షులు దుడ్డు కృష్ణ, ఎస్సీ సెల్ నాయకులు మైసయ్య, యువజన నాయకులు రవి యాదవ్,  కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *