ప్రజావాణిలో 18 దరఖాస్తులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: సోమవారం సిద్దిపేటలోని సమీకృత జిల్లా కార్యలయ సముదాయంలోని సమావేశ మందిరంలో డిఆర్ఓ నాగరాజమ్మ ఆద్వర్యంలో ప్రజావాణి కార్యక్రమ నిర్వహణ జరిగింది. జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలను విన్నవించుకుని పరిష్కరించుకోవడానికి అర్జిదారులు కార్యలయంకి వచ్చారని అర్జిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా జిల్లా అధికారులు పని చెయ్యాలని సూచించారు. ప్రజావాణిలో  18 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎఓ అబ్దుల్ రహమాన్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *