ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు!
ఏమిటి దీని అర్ధం అధినేతలూ?
సమస్యల ఊబిలోనే జనాలు!
ఏ గట్టున ఉన్నారు పరిష్కర్తలు?
కోట గదుల్లోనే ప్రభుత్వ పెద్దలు!
ఎలా తీరతాయి పేటల్లో వెతలు?
ఇక్కట్ల దరికే రావాలి పాలకులు!
మెట్లు దిగితేనేగా తెలిసేది పాట్లు?
– వి. రమేష్ బాబు




