భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 30 : ప్రజాతంత్ర 2023 క్యాలెండర్ ను భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాతంత్ర తెలంగాణ పత్రిక దినదిన అభివృద్ధి చెందటం ఎంతో ఆనందదాయకమని అన్నారు. అన్ని పత్రికలు దీటుగా వార్తలు అందించడంలో ఎంత గానో పనిచేస్తుందని కొనియాడారు. ప్రజాతంత్ర క్యాలెండర్ ను విజయవంతంగా మూడవ సంవత్సరం కూడా నా చేతుల మీదుగా ఆవిష్కరింపజేసిన ప్రజాతంత్ర టీంకు ధన్యవాదాలు తెలిపారు.
రానున్న రోజుల్లో తెలంగాణలో మరింత ముందుకు సాగేలా కృషి చేయాలని విలేకరులను కోరారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలు రాస్తున్న ప్రజాతంత్ర విలేకరులను ఆయన అభినందించారు. పత్రికను తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిగా నెల పాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ నాయకులు, వివిధ మండలాల ప్రజాతంత్ర విలేకరులు పాల్గొన్నారు.




