ఇల్లందు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కి తగిన బుద్ధి చెబుతారని బిజెపి రాష్ట్ర ఎన్నికల ప్రచార కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శనివారం అయితే ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నుండి పంచాయతీల అభివృద్ధి కోసం విడుదల చేసిన నిధులను పంచాయతీల అభివృద్ధికి వెచ్చించకుండా సొంత ప్రయోజన కోసం వాడుకున్నారు అని తెలంగాణలో స్థానిక ప్రజా ప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చాలని ఎన్నికల సమయంలో మాత్రమే కేసీఆర్కు సంక్షేమ పథకాలు గుర్తువస్తాయని ఎన్నికల సమయంలోనే నానా హడావుడి చేస్తారని ఈ లక్ష్యం కోసమైతే తెలంగాణ సాధించుకున్నాము ఆ లక్ష్యాన్ని నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం దీన్ని గుర్తించిన బిజెపి రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జెండా ఎగురవేసేందుకు ప్రణాళిక రూపొందించుకొని తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉందని అందులో భాగంగానే వందరోజుల ఎన్నికల ప్రణాళికను రూపొందించుకొని ప్రతి నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు దేశంలో ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ చేయని విధంగా అనుభవం కలిగిన ప్రజాప్రతినిధులను నాయకులను నియోజకవర్గంలా వ్యాప్తంగా తిరుగుతున్నారని ఇదిలా ఉండగా నేడు ఖమ్మంలో జరిగే కేంద్ర హోం శాఖ మంత్రి అమీషా పర్యటన విజయవంతం చేయాలని బిజెపి శ్రేణులకు అభినందనలు కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ సమీర్ కునావర్, రాజ వర్ధన్ రెడ్డి ధర్మారావు, మాజీ ఎమ్మెల్యే ఓకే అబ్బయ్య, బిజెపి ఉపాధ్యక్షుడు నాళ్ళ సోమసుందర్, ప్రధాన కార్యదర్శి గోపికృష్ణ, పట్టణ అధ్యక్షుడు సంజీవరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రాంచందర్, నాయక్, సురేందర్ నాయక్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.




