పటాన్ చెరు,ప్రజాతంత్ర, జనవరి 3: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 11, 12, 13 వార్డులలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలులో భాగంగా వివిధ సంక్షేమ పథకాల కోసం ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కమిషనర్ జ్యోతి రెడ్డి, కౌన్సిలర్లు మంజుల ప్రమోద్ రెడ్డి, లావణ్య శశిధర్ రెడ్డి, బిఆర్ ఎస్ సీనియర్ నాయకులు కొల్లూరు యాదగిరి, చౌటకూరి మైపాల్ రెడ్డి, దాస్ యాదవ్, పట్లోళ్ల భాస్కర్ రెడ్డి, కొండ లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.
ప్రజా పాలనలో పాల్గొన్న అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి




