‌ప్రజలే సినిమా చూపిస్తారు..

  • బిఆర్‌ఎస్‌ ‌నేతలు సిద్ధంగా ఉండాలి
  • దళిత, గిరిజన మహిళలకు రక్షణ ఏదీ
  • స్వాతంత్య్ర దినోత్సవాన మహిళపై థర్డ్ ‌డిగ్రీనా..
  • వీటన్నటికీ సమాధానం ఎందుకు చెప్పరు
  • కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌
‌మహిళలపై అఘాయిత్యాలు కానరావడం లేదా : ట్విట్టర్‌ ‌పిట్ట పలకడం లేదని ఎంఎల్‌ఏ ‌రఘునందన్‌ ‌విమర్శలు
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : : ‌రాబోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలని, సినిమా చూసేది మాత్రం బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలని బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ‌మంత్రి కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చారు. ప్రతిపక్షాలకు వి•రు సినమాచూపడం కాదు..ప్రజలే అసలుసిసలు సినిమా చూపిస్తారని విమర్శించారు.ఇది ట్రైలర్‌ ‌మాత్రమేనని.. ప్రతిపక్షాలకు అసలు సినిమా ముందు ఉందని స్టీల్‌ ‌బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలకు ఈటల ఘాటుగా సమాధానం ఇచ్చారు. సినిమా అయినా, ట్రయల్‌ అయినా అది ప్రజలే చూపిస్తారని, నాయకులు కాదని అన్నారు. సినిమా చూపించేది ప్రజలైతే, చూడాల్సింది బీఆర్‌ఎస్‌ ‌నాయకులు అన్నారు. శనివారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు సినిమా చూపించబోతున్నారన్నారు. అందుకు బీఆర్‌ఎస్‌ ‌నేతలు సిద్ధంగా ఉండాలని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ఏలుబడిలో గిరిజన, దళిత మహిళలకు రక్షణ లేకుండా పోయింది… అన్నిరంగాల్లో తెలంగాణ నంబర్‌ ‌వన్‌ అని బుకాయుస్తున్నారు ఈటల విమర్శించారు.
రక్షణ కల్పించాల్సిన పోలీస్‌ ‌స్టేషన్లు భయపెట్టిస్తున్నాయని..  గిరిజన మహిళపై జరిగిన దాడి చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుందని ఆరోపించారు.  షీ టీమ్‌ ‌పెట్టినం అని చెప్తున్నారు. అర్ధరాత్రి కూడా స్వేచ్చగా తిరగవచ్చు అని చెప్పారు. కానీ ఎల్‌ ‌బి నగర్‌లో కూతురు పెళ్లి కోసం వెళ్ళి వస్తున్న మహిళను పోలీసులే తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారన్నారు. క్యారెక్టర్‌ ‌లేని మహిళగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.  ఆమెను కొట్టిన తీరును తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్‌ ‌రాష్ట్రంలో మహిళ వి•ద జరిగిన దౌర్జన్యం వి•ద సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు.  యావత్‌ ‌తెలంగాణ గమనిస్తోందని  చెప్పరానిచోట్ల కొట్టిన తీరుపై స్పందించాలన్నారు. చిన్న ఉద్యోగుల వి•ద చర్యలు తీసుకొని చేతులు దులుపుకుంటే సరిపోదన్నారు. మరియమ్మ అనే దళిత మహిళను యాదాద్రి భుమనగిరి జిల్లా  అడ్డగూడూరు పోలీస్‌ ‌స్టేషన్లో కొట్టి చంపారని గుర్తు చేశారు.
దళిత, గిరిజన మహిళలపై జరుగుతున్న సంఘటనలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ ‌చేశారు. పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.  ప్రభుత్వం బేషరుతుగా క్షమాపణ చెప్పాలన్నారు.  కెసిఆర్‌ ‌చేస్తున్న పనులని ప్రజలు మర్చిపోరు.. మర్లపడతారని హెచ్చరించారు. సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో  దళితబంధు, డబుల్‌ ‌బెడ్‌ ‌రూం కోసం రోడ్డు ఎక్కుతున్నారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులను పెట్టీ అరెస్ట్ ‌చేయించారు. పోలీసులతో ఎన్నాళ్ళు రాజ్యం నడిపిస్తారని ఈటల రాజేందర్‌ ‌ప్రశ్నించారు.  హైదరాబాద్‌లో స్వాతంత్య ్రదినోత్సవం రోజున గిరిజన మహిళపై పోలీసులు దాడి చేస్తే సీఎం కేసీఆర్‌ ‌స్పందించడం లేదని మండిపడ్డారు. ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ ‌చేసి చేతులు దులుపుకుంటున్నారన్నారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్‌ ‌చేశారు. అలాగే బాధితురాలికి క్షమాపణ చెప్పాలన్నారు. గిరిజన మహిళపై దాడి విషయంపై దర్యాప్తు చేయాలన్నారు. గజ్వేల్‌ ‌నియోజకవర్గంలో దళిత బస్తీలో జనాలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈటల రాజేందర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు.
మహిళలపై అఘాయిత్యాలు కానరావడం లేదా : ట్విట్టర్‌ ‌పిట్ట పలకడం లేదని రఘునందన్‌ ‌విమర్శలు
ఇతర రాష్ట్రాల్లో ఘటనలపై స్పందించే ట్విట్టర్‌ ‌పిట్ట స్పందించాలని అంటూ..ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు పరోక్ష విమర్శలు గుప్పించారు. ఇతర రాష్టాల్లో్ర ఘటనలపై స్పందించే ట్విట్టర్‌ ‌పిట్ట స్పందించాలని డిమాండ్‌ ‌చేశారు. శనివారం వి•డియాతో మాట్లాడుతూ… గిరిజన మహిళను పోలీసులు కొడితే.. సీఎంవోలో ఐఏఎస్‌ అధికారి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు ట్విట్టర్‌ ‌పిట్టకు కన్పించటం లేదా అని నిలదీశారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌, ‌కవిత ఎందుకు స్పందించటం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సొంత నియోజకవర్గంలో మహిళకు జరిగిన అన్యాయం కంటే.. ఎమ్మెల్యే సీటే సబితా ఇంద్రారెడ్డికి ముఖ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే మహిళపై దాడి చేయటం బాధాకరమన్నారు. ఘటనకు బాధ్యులైన ఎస్‌హెచ్‌ఓ, ‌పోలీసు ఉన్నతాధికారులను శిక్షించాలని డిమాండ్‌ ‌చేశారు. సీసీ టీవీలు లేనప్పుడు.. రూ.1200 కోట్లతో కట్టిన కమాండ్‌ ‌కంట్రోలు ఎందుకు అంటూ రఘునందన్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ••గా.. పోలీసుల చేతిలో తీవ్రంగా గాయపడి కర్మాన్‌ఘాట్‌లోని జీవన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు వరలక్ష్మిని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావు శనివారం పరామర్శించారు. ఆమెను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు వరలక్ష్మి పట్ల మానుషంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబానికి అండగా ఉంటామని చెబుతూ.. బాధితురాలి కుటుంబానికి తమ వంతు సాయంగా కొంత నగదును అందజేశారు. అలాగే పలువురు నేతలు కూడా రఘునందన్‌ ‌రావుతో కలిసి బాధిత మహిళ వరలక్ష్మిని పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *