హైదరాబాద్, పిఐబి, ఫిబ్రవరి 22 : దేశీయంగా వాయు మార్గంలో ప్రయాణించినటువంటి వారి సంఖ్య 4.45 లక్షలకు చేరుకొన్న తరుణంలో, విమానాశ్రయాల సంఖ్య అధికం కావడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. కోవిడ్ అనంతర కాలంలో వాయు మార్గ ప్రయాణికుల సంఖ్యలో ఒక క్రొత్త పెరుగుదల నమోదు అయింది. ఈ సందర్భంగా పౌర విమాన శాఖ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్‌ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ…‘‘మరిన్ని విమానాశ్రయాలు మరియు మెరుగైన సంధానం..విమాన యాన రంగం ప్రజలను సన్నిహితం చేయడంతో పాటుగా దేశ పురోగతిని కూడా పెంచుతుంది.’’ అని ఒక ట్వీట్లో పేర్కొన్నారు.



