ప్రజా సంక్షేమం, అభివృద్ధి మా లక్ష్యం.
అర్హులందరికీ కాంగ్రెస్ సంక్షేమాలుసిద్దిపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచర్జ్ పూజల హరికృష్ణ
సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రజలకు నిజమైన ప్రజాపాలన అందుబాటులోకి వచ్చిందని సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు. గురువారం నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. 43 వ,32 వ వార్డ్ లలో ప్రజాపాలన కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజల హరికృష్ణ మాట్లాడుతూ ..ప్రజలను ప్రభుత్వ ఆఫీసుల చూట్టూ తిరిగే సంస్కృతికి సిఎం రేవంత్ రెడ్డి చెల్లు చిటీ ఇచ్చారని, ప్రజల వద్దకే నిజమైన పాలన అందించే దిశగా అడుగులు పడ్డాయన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో రెండు పథకాలు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్, చేయూత కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల బీమా ఇప్పటికే అమలు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపే మిగతా 4 పథకాలకు సంబంధించి దరఖాస్తులను ఈ రోజు నుండి స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా దరఖాస్తు దారులతో దేయంగ మాట్లాడి దరఖాస్తులను ఎలా వినియోగించాలో వివరించారు. దరఖాస్తులు కోరుత ఉన్నట్లు గా హరికృష్ట దృష్టికి రావడంతో వెంటనే ఉన్నత అధికారుల దృష్టి కి తీసుకవెళ్లి సమస్య పరిష్కారించారు. అధికారులు సమయ పాలన పాటించేలా చూడాలని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకొందన్నారు. పత్రి ఒక్క అర్హునికి ఈ పథకాలు అందేలా ప్రజల వద్దకే ప్రజా పాలన తీసుకువెళ్లి ముందుండి నడిపిస్తానన్నారు. ప్రజల ఎవరు కూడా భయాందోళనకు గురికావద్దని, జనవరి 6 తర్వాత కూడా దరఖాస్తులను ప్రభుత్వ కార్యాలయంలో ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయంలో తీసుకోవడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయిని నర్సింహారెడ్డి, కలీమ్ ఉద్దీన్, అంజిరెడ్డి, మాల్లారెడ్డి, రాజబహుదూర్,యాదగిరి, గోపికృష్ణ, వాహబ్, ఇమ్రాన్, ఖాజా పాషా, వంశీ, బైరి శంకర్, అనిల్,తదితరులు పాల్గొన్నారు.





