‌ప్రచారంలో బిఆర్‌ఎస్‌ ‌దూకుడు

  • కాంగ్రెస్‌ ‌గ్యారెంటీలకు ధీటైన మేనిఫెస్టో తయారీకి కసరత్తు
  • 16న వరంగల్‌ ‌సభతో సిఎం కెసిఆర్‌ ఎన్నికల శంఖారావం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 5 : ‌తెలంగాణలో ఎన్నికల హడావుడి పెరిగింది. అధికార బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎన్నికల ప్రచారంలో మరింత వేగం పెంచనుంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితా ప్రకటించి..అభివృద్ధి  కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో కెటిఆర్‌, ‌హరీష్‌ ‌సహా యంత్రులందరూ బిజీబిజీగా ఉన్నారు. దశల వారీగా డబుల్‌ ‌బెడ్‌రూమ్‌ ఇళ్లు అందిస్తూ..పెండింగ్‌  ‌ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రారంభిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ‌వొచ్చే లోగా… చేయాల్సిన పనులు, ఇచ్చిన హావి•లు నెరవేస్తున్నారు. ఈ క్రమంలో ఇక తొలి శంఖారావాన్ని వరగంల్‌ ‌నుంచి ఈ నెల 16న సిఎం కెసిఆర్‌ ‌పూరించనున్నారు. ఇక వొచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పక్కా వ్యూహరచన చేస్తుంది బీఆర్‌ఎస్‌. ఎన్నికల బరిలో దిగే క్యాండిడేట్స్‌ను అందరి కంటే ముందుగా ఖరారు చేసింది. ఇప్పుడు  మేనిఫెస్టోకు మెరుగులు దిద్దుతుంది. 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి…సిఎం కెసిఆర్‌ ‌చేతుల మీదుగా మేనిఫెస్టోను రిలీజ్‌ ‌చేసేందుకు ప్లాన్‌ ‌చేస్తుంది.

ఈనెల 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి…ఆ సభలోనే సీఎం కేసీఆర్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌మేనిఫెస్టో విడుదల చేస్తారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. వరంగల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్ని మంత్రి హరీష్‌రావు…ఈనెల 16న వరంగల్‌ ‌భారీ బహిరంగ సభ జరగబోతుందని చెప్పారు. వరంగల్‌ ‌సభా వేదికలో సీఎం కేసీఆర్‌ ‌మేనిఫెస్టో రిలీజ్‌ ‌చేయబోతున్నట్టు చెప్పారు. అంతేకాదు శుభవార్త వినడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలని కూడా ఆయన చూసించారు. అంతేకాదు…ప్రతిపక్షాలకు మైండ్‌ ‌బ్లాక్‌ అయ్యేలా బీఆర్‌ఎస్‌ ‌మేనిఫెస్టో ఉండబోతుందన్నారు మంత్రి హరీష్‌రావు. బీఆర్‌ఎస్‌ ‌మేనిఫెస్టోపై రోజూ ఎదో ఒక హింట్‌ ఇస్తూ…హైప్‌ ‌క్రియేట్‌ ‌చేస్తున్నారు మంత్రి హరీష్‌రావు. బుధవారం కూడా మేనిఫెస్టో గురించి మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ‌మేనిఫెస్టోలో మహిళలకు ప్రత్యేక హావి•లు ఉంటాయని చెప్పారాయన.

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్‌.. ‌మంచి పథకాలు ప్రకటించబోతున్నారని కూడా  చెప్పారు. మేనిఫెస్టోలో మహిళల కోసం శుభవార్త ఉందంటూ ఊరించారు. హరీష్‌రావు టీజర్లతో… బీఆర్‌ఎస్‌ ‌మేనిఫెస్టోపై ప్రజల్లో ఆసక్తి పెరిగిపోతుంది. మేనిఫెస్టోలో అంతలా  ఏమేమి హావి•లు ఉండబోతున్నాయో అని… ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 16న వరంగల్‌ ‌సభలో సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించబోయే మేనిఫెస్టోలో ఏయే హావి•లు ఉండనున్నాయి..? మహిళలకు ప్రత్యేక స్కీమ్‌లు పెట్టబోతున్నా..? కాంగ్రెస్‌ ఆరు  గ్యారెంటీలకు మించిన పథకాలు ఉండబోతున్నాయా? అనే ర్చ నడుస్తుంది. ఇక నిపుణులతో చర్చించి మరీ సీఎం కేసీఆర్‌ ‌మేనిఫెస్టో రూపొందిస్తున్నారని వార్తలు వొచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *