తాండూరు ప్రజాతంత్ర అక్టోబర్ 12 : వికారాబాద్ జిల్లా తాండూర పట్టణంలో పోలీసులు చేపట్టిన తనిఖీలలో భారీగా నగదు సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు పక్కగా ఎన్నికల కోడ్ ను అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా గురువారం పట్టణ పోలీసులు పట్టణంలోని వినాయక చౌక్ లో పట్టణానికి చెందిన కలాల్ మల్లయ్య అనే వ్యక్తి ఇట్టి రూ.5.46.620 నగదును బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళుతుండగా సివిల్ పోలీసులు. అట్టి నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రూ 50,000 కంటే ఎక్కువ నగదును తరలించరాదని ఎన్నికల నిబంధన లో ఉంది కావున దీంతో ఇట్టి నగాదును సీజ్ చేసి స్క్రీనింగ్ కమిటీ సభ్యులకు అందజేసినట్లు తాండూరు పట్టణ సిఐ రాజేందర్రెడ్డి తెలిపారు.
పోలీసుల తనిఖీలలో భారీగా నగదు పట్టివేత





