పోరాడే ఎర్రజెండాకే మీఓట్లు వెయ్యండి
– సిపిఎం అభ్యర్థి పగడాల యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలి
– సిఐటియు రాష్ట్ర నాయకుల పిలుపు
ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 27 : మండల కేంద్రంలోని పాషా నరహరి కార్యాలయంలో ప్రజా సంఘాలు,సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులసమావేశం నిర్వహించారు.సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్న కార్మికులకు మద్దతుగా ఉంటున్న సిపిఎం పార్టీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల యాదయ్యకి కార్మికులు అందరూ ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్,సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి,రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ లు మాట్లాడుతూ, నిరంతరం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై,అంగన్వాడి టీచర్లు,ఆయాలు, ఆశ వర్కర్ల సమస్యలపైన,మధ్యాహ్న భోజనం కార్మికులు,భవన నిర్మాణ కార్మికులు,స్కీమ్ వర్కర్లు,అసంఘటిత రంగ కార్మికులు,కాంట్రాక్ట్ వర్కర్ల సమస్యలపై, ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో,ట్రాన్స్పోర్ట్ రంగాలలో నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక సంఘం సిఐటియుకు మద్దతుగా సిపిఎం పార్టీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల యాదయ్యకి నియోజకవర్గంలోని అన్ని రంగాల కార్మికులందరూ ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్మికులందరికీ పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల రాష్ట్ర అధ్యక్షులు గ్యారపాండు,సిఐటియు జిల్లా కోశాధికారి కవిత,సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెండ్యాల బ్రహ్మయ్య,సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి స్వప్న,జిల్లా నాయకులు పోచమోని కృష్ణ,కార్మిక నాయకులు దేవదాసు,యాదయ్య,సరిత,అలివెలు, లక్ష్మి,సూజాత,అనసూయ,అలివేలు,




