ఘట్కేసర్ ప్రజాతంత్ర సెప్టెంబర్ 20 : ప్రభుత్వ భూములు చెరువులు, కుంటలు కబ్జాలు చేస్తున్న మేడ్చల్ నియోజకవర్గం పోచారం మున్సిపాలిటీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ల పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాచారం కోరుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) యాక్టివిస్ట్ పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ లక్ష్మీనరసింహ కాలనీకి చెందిన సురేష్ బాబు దరఖాస్తు చేశారు. ఈ సంవత్సరం మార్చి నెలలో పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ సర్వేనెంబర్లు 3/1, 64, 87ల లోని ప్రభుత్వ భూములలో ప్లాట్లను చేసి అమ్ముకొని అక్రమార్చనకు పాల్పడుతున్నారని, చెరువులు కబ్జా చేస్తున్నారని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ పై ఇరిగేషన్ శాఖకు ఫిర్యాదు చేసినట్లు సురేష్ బాబు తెలిపారు.




