ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 17 : ఆమనగల్లు పట్టణంలోని గుర్రం గుట్ట కాలనీకి చెందిన విద్యార్థి ఆమనగల్లు లోని లిటిల్ స్కాలర్ స్కూల్లో చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులకు తెలవకుండా ఇంట్లో నుంచి స్మార్ట్ ఫోన్ ను పాఠశాలకు తీసుకొచ్చి ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫోన్లో ఫోటోలు దిగేందుకు తీసుకొచ్చాడు. తదనంతరం మాడుగుల వెళ్ళే దారిలో పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ఫోను పోగొట్టుకున్నాడు. ఈ విషయమై తల్లిదండ్రులు కొడతారని భయంతో స్థానిక పోలీసులకు జరిగిన విషయం వివరించాడు.. ఈ విషయం పై ఎస్సై బలరాం నాయక్ పోలీస్ కానిస్టేబుల్ బి. శివకుమార్ కు విచారించాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు పట్టణంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి శ్రీనివాస్ కాలనీలో నివాసం ఉండే ఓ యువకుడు ఫోన్ తీసుకెళ్లడం కనిపించింది దీంతో అతని వద్ద నుండి ఫోన్ ను తీసుకొని బాధతురాలు మూడావత్ భారతి కి ఎస్సై బలరాం నాయక్ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ శివకుమార్ అందజేశారు.



