కొన్ని పరిస్థితులకు
తలవొగ్గితే నీ పరువేం పోదు
నీ నిసహాయత చూసి
హేళన చేయనీయి
నవ్విన నాప చేను
పండించి చూపించు
చదువుకుంటేనే సంస్కారం
వస్తుంది అనుకునే వెర్రి భ్రమల్లోబతకొద్దమ్మ
తల్లి పాలు తాగి
తల్లి రొమ్ములు గుద్దే
కుసంస్కారులు తిరిగే పాడు లోకం ఇది
నగ్నంగా నిన్ను ఊరేగించి
వికృత చేష్టలు చేసిన సైకోల
చర్యలకు నువ్వు సిగ్గు పడకర్లేదు
ఇలాంటి వాళ్ళను కన్న
తల్లిదండ్రులు సిగ్గు పడాలి
ఇలాంటి దుస్థితికి తెచ్చిన పాలకుల
తలలు భూమికి కృంగాలి
ఇలాంటి సమాజంలో బతుకీడుస్తున్న
మాలాంటి వాళ్ళంతా తల దించుకోవాలి
నువ్వేందుకు తల్లి తల దించుకోవాలి
వాళ్ళ పైశాచికంపై నిప్పులు చెరుగు
ఎక్కడైతే స్త్రీలు పూజింప బడతారో
అక్కడ దేవతలు నడయాడతారు అన్న
లోకోక్తి ఉన్న ఈ పవిత్ర పుణ్యభూమిలో
పుట్టిన నీకు ఈ దుర్గతి కలిగిందా తల్లి
నీకు సాయం చేయని వాళ్ళను
నీకు రక్షణ కల్పించని వాళ్లను
క్షమాగుణం లో పునీతులు కానియ్ తల్లి
తప్పుకు శిక్ష పడవలసిందే
నీకు తగిన న్యాయం జరగ వలసిందే
– గాదిరాజు రంగరాజు
8790122275




