జగదేవపూర్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: జగదేవపూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో సర్పంచ్ రావికంటి చెంద్రశేఖర్ గుప్తా ఆధ్వర్యంలో పేదింటి బిడ్డ ధ్యాప నర్సింలు సుశీల కూతురు కళ్యాణి వివాహానికి పుస్తె మట్టెలు అందించి ఆశీర్వదిoచారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నీరుపేద పేద ప్రజలకు సేవ చేయడంలో ఎంతో ఆనందం ఉంటుందని, గ్రామ ప్రజలకు మరిన్ని సేవలు చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమం లో గ్రామ మాజీ ఉప సర్పంచ్ మెట్టు స్వామి గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షుడు నర్సొళ్ల స్వామి పిఎసిఎస్ డైరెక్టర్ వెంకటయ్య, కొండపోచమ్మ డైరెక్టర్ మల్లం జానకిరాములు మాజీ డైరెక్టర్ దొడ్డి మల్లేశం ముదిరాజ్ కులం పెద్ద మనిషి ధ్యాప నర్సింలు గ్రామ బీ ఆర్ యస్ నాయకులు బింగి నర్సింహా ఎర్రోళ్ల నరేష్ తుమ్మ భాస్కర్ మోటం శ్రీను ధ్యాప యాదగిరి మెట్టు కనకయ్య తొలిచుక్క బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


