పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్  ఆర్థిక సహాయం అందజేత 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 23 :  పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్టు చేయూతనందిస్తూ.. తన ఉదార స్వభావం చాటుకుంటోంది. ఇందులో భాగంగా కడ్తాల మండలంలోని కొండ్రిగాని బోడు తండా గ్రామపంచాయతీ పరిధిలోని పిల్లి గుండు తండాకు చెందిన రెండు పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించింది.. సభావట్ సేవ్య-జీజ దంపతుల కూతురు రాజేశ్వరి వివాహానికి రూ.10,116 ఆర్థిక సాయం అందించగా, ఇదే తండకు చెందిన రామావత్ కిషన్-బామ్ణి దంపతుల కూతురు శిరీష వివాహానికి రూ.10,116 లు ఆర్థిక సహాయాన్ని జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ చేతుల మీదుగా అందించారు. రెండు కుటుంబాలకు కలిసి మొత్తం రూ. 20, 232 లను అందించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్, వైస్ ఎంపీపీ ఆనంద్, ఉప సర్పంచ్ శ్రీను, గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజు, నాయకులు గణేష్, రాజు, సేవ్య, నరేష్, కుమార్, శ్రీను, ఇర్షాద్,  వాసు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *