ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 16 : పేదింటి కుటుంబాలకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ కొండంత అండగా నిలుస్తుంది. మండలంలో ఏ పేదింటికి ఆపద వచ్చినా తానున్నాననే భరోసా కల్పిస్తున్నారు దశరథ్ నాయక్ పేద కుటుంబాలు ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. కడ్తాల్ మండలంలోని మర్రిపల్లి గ్రామపంచాయతీకి చెందిన బొడ్డుపల్లి అనూష వివాహానికి జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ రూ.10,116/ల ఆర్థిక సహాయం అందించారు. అనూష చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. అనూష నాయనమ్మనే అన్ని తనై అనూష వివాహం జరిపిస్తుంది. విషయం తెలుసుకున్న జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ వెంటనే మర్రిపల్లి చేరుకొని నాయనమ్మను అభినందించి, అనూష వివాహానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్, జిల్లా రైతు సమన్వయ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రైతు కోఆర్డినేటర్ జోగు వీరయ్య, సర్పంచ్ భాగ్యమ్మ జంగయ్య, ఉప సర్పంచ్ నరసింహ, గ్రామ కమిటీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, వార్డు సభ్యులు కృష్ణారెడ్డి, నాయకులు హరియా నాయక్, మోహన్ రెడ్డి, అనంతరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పేదింటి ఆడపిల్ల పెళ్లికి రూ. 10వేల ఆర్థిక సాయం అందజేత జడ్పిటిసి దశరథ్ నాయక్





