పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి
మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యాన్ని మన రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలలో ఒకటి మహాలక్ష్మి మహిళల ఉచిత బస్సు ప్రయాణం రెండవది ఆరోగ్యశ్రీ 10 లక్షల ఆరోగ్య భీమా పథకాలను ప్రభుత్వం ఏర్పడి మూడు రోజుల్లోనే అమలకు శ్రీకారం చుట్టిందని, ఇందులో భాగంగా శనివారం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మహిళల కోసం ప్రకటించిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాన్ని తాండూరు ఎమ్మెల్యే బుయాని మనోహర్ రెడ్డి  బస్ స్టేషన్ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్ల ప్రచారంలో భాగంగా తుక్కుగూడ బహిరంగ సభలో శ్రీమతి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఇచ్చిన హామీ మేరకు  భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేందుకు మహాలక్ష్మి రాజు ఆరోగ్యశ్రీ 10 లక్షల ఉచిత భీమా రెండు పథకాలను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని పథకాన్ని ప్రారంభం చేయడం జరిగిందని తెలిపారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన ఆరుగారింటలను తప్పక అమలు చేసి తీరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు ఆర్టీసీ డిఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *