సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని రైతుబందు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేవి రవీందర్ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లాకుకునూరుపల్లి మండలం మెదనీపూర్ గ్రామ సర్పంచ్ తాడెం దశరథం, బిఆర్ఎస్ సీనియర్ నాయకుదు రమేష్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేవి రవీందర్ ..విజయ్ 60వేల రూపాయల చెక్కును, ప్రవీణ్ రెడ్డి 55000, తాడం కనుకయ్య 60000, అక్కవ్వ 60000 రూపాయల చెక్కులను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి సహకారంతో మంజూరు అయిన చెక్కులను మెదిని పూర్ గ్రామంలో అందజేసిన అనంతరం దేవి రవీందర్ మాట్లాడుతూ… అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే నిరుపేదలను ఆదుకోవాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పేదల నాదుకోవడం జరుగుతుంది నిరుపేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పిష్క బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.




