నర్సంపేట నియోజకవర్గ విద్యార్థులు కేవలం 10000 రూపాయలు ఫీజుతోఎంబిబిఎస్ చదువుకోవచ్చు అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చోరువతో నర్సంపేట నియోజకవర్గ ప్రాంత ప్రజల శ్రేయస్సు కొరకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృషితో ఇటీవల రూ. 183 కోట్లతో నూతనంగా మంజూరైన ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులకు మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు, ఎంపీ మాలోత్ కవిత, కలెక్టర్ ప్రావీణ్య, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరు ప్రముఖులతో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. నర్సంపేటలో మంత్రి హరీశ్ రావుకు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, ఎమ్మెల్యే పెద్ది దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానం పలికారు. అనంతరం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…మెడికల్ హబ్‌గా నర్సంపేట తయారు కానున్నట్లు అని చెప్పారు. నర్సంపేటలోనే ఎంజిఎం సేవలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి రానున్నయన్నారు. నర్సంపేట అభివృద్ధికి పెద్ది కృషి అభినందనీయం అని ఆయన కొనియాడారు.
తెలంగాణ దేశంలో నెంబర్ వన్ ఘనత కేసీఆర్ దేనని హరీష్ రావు అన్నారు. నర్సంపేటకు మెడికల్ కళాశాల వస్తదని కలలో కూడా అనుకోలేదన్నారు. జిల్లా కేంద్రంలో ఉండాల్సిన మెడికల్ కళాశాల నర్సంపేటకు కేటాయించడంలో ఎమ్మెల్యే పెద్ది కృషి అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నర్సంపేటలో మెడికల్ కళాశాల కేటాయింపు నియోజకవర్గ ప్రజలకు వరమన్నారు. జనగామ, భూపాలపల్లి నర్సంపేటలో ఇలా దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల కెసిఆర్ మంజూరు చేశారని తెలిపారు. నర్సంపేటకు జిల్లా హాస్పిటల్, మెడికల్ కళాశాల, డయాగ్నస్టిక్ సెంటర్ ఇలా వైద్య రంగానికి సంబంధించిన పలు వసతులు సమకూర్చి ఎమ్మెల్యే పెద్ది నర్సంపేటను మెడికల్ హాబ్‌గా చేయాలనుకుంటున్నారని హరీష్ రావు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో ధాన్యం ఉత్పత్తిలో, మెడికెల్ కళాశాలలో తెలంగాణా నంబర్ వన్ అన్నారు. ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్ రెడ్డి పట్టుదలతో దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా రామప్ప, రంగాయ చెరువులకు నింపి పాకాల, మాదన్నపేట మొదలగు చెరువులకు నీరు అందిస్తున్నారన్నారు.
కెసిఆర్ కృషితో గోదావరి జలాల వల్ల లక్నవరం, పాకాల వంటి పెద్ద, చిన్న చెరువులలో నీళ్లు సమృద్ధిగా ఉండి రెండు పంటలు పండుతున్నాయన్నారు. మున్నేరు, పాకాల, పెద్దవాగు మీద చెక్ డ్యామ్ 35 కేమి మేర 13 చోట్ల చెక్ డ్యాములు పెద్ది కృషితో నిర్మించామన్నారు. కాళేశ్వరం ద్వారా నీరు తెచ్చుకొని నర్సంపేట మొత్తం లక్ష ఎకరాల పంటకు సాగునీరు అందుతున్నదని చెప్పారు. కేసీఆర్ హయాంలో రైతుబందు, ఇంటింటికి తాగునీరు, డాక్టర్ల ఉత్పత్తి లోతెలంగాణ నంబర్ వన్ అని హరీష్ రావు అన్నారు. గత సంవత్సరం 300 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశానని, ఇపుడు 183 కోట్లతో మెడికెల్ కలేజ్కు శంకుస్థాపన చేసానని, వొచ్చే యేడాది ఈ సమయానికి మెడికల్ కళాశాల ప్రారంభించుకునేలా పనులు పూర్తి చేయాలని సూచించారు. 150 మంది డాక్టర్లు నిరంతరం నర్సంపేట ప్రజలకు వైద్యాన్ని అందిస్తారన్నారు. గతంలో డాక్టర్లు చదువుకు విదేశాలకు విద్యార్థులు వెళ్లేవారు కానీ నేడు ఏ జిల్లా వారు ఆ జిల్లాలోనే చదువుకోవచ్చు అని కెసిఆర్ చేసి నిరూపిస్తున్నారన్నారు.
పేదలకు వైద్యం, ప్రతి లక్ష జనాభాకు 22 మంది డాక్టర్లను చేస్తూ తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదన్నారు. వృద్దులకు ప్రతి నెల 2116 కేసీఆర్ ఆసరా పెన్షన్ అందిస్తుంటే ఇతర జిల్లాల్లో కేవలం 600 మాత్రమే అందిస్తున్నారన్నారు. 200 పెన్షన్ ను 2 వేలకు పెంచిన ఘనత కెసిఆర్ కె దక్కుతుందన్నారు. రైతు బంధును 50 శాతం సబ్సిడీతో 75 కోట్ల రూపాయల తో వ్యవసాయ పనిముట్లు నర్సంపేట రైతులకు అందిస్తున్న గొప్ప పథకం అని తెలిపారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే తనకు ఎంతో ఇష్టం అని, తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన అనుభందం తమదని ఆయన గుర్తు చేశారు. పక్క రాష్ట్రాలలో అమలు కాని పెన్షన్ పథకం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నాలుగు వేలు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీవి ఆరు పథకాలు కాదు ఆరుగురు ముఖ్యమంత్రులుగా పోటి పడతారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ 5 కోట్లకు అమ్ముకుంటున్నారట వాళ్లలో వాళ్లే అనుకుంటున్నారు గమనించండని అన్నారు.
కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఓక్కసారి ఆలోచన చేయాలి, ఏ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి జరిగిందో గమనించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టోనులో ఆరు సంక్షేమ పధకాలు పెట్టారు. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎంత పెన్షన్ ఇస్తున్నారు అని ప్రశ్నించారు. స్థానిక ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. నర్సంపేటకు మెడికల్ కళాశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా హాస్పిటల్ మంజూరు కావడానికి స్థల దాత దొడ్డ మోహన్ రావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్సీలు, జెడ్పి చైర్ పర్సన్, వైస్ చైర్మన్, ఫ్లోర్ లీడర్, మున్సిపల్ చైర్ పర్సన్, ఓ డి సి ఎం ఎస్ చైర్మన్, డిఆర్ డిఎ పిడి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపిపిలు, జెడ్పిటిసిలు, పిఎసిఎస్ చైర్మన్లు, ఆర్ఎస్ఎస్ కన్వీనర్లు, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు, రైతులు, లబ్దిదారులు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




