పెళ్లికి ముందే గర్భం దాల్చిన బాలిక

యూట్యూబ్‌లో చూసి సొంతంగా డెలివరీ   పసకిందు పీక నులిమి చంపివేత
ముంబై, మార్చి 6 : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 15 ఏండ్ల ఓ బాలిక యూట్యూబ్లో చూస్తూ ఇంట్లోనే సొంతంగా డెలివరీ చేసుకొంది. అనంతరం పుట్టిన బిడ్డను గొంతునులిమి చంపేసింది . ఘటనకు సంబంధించి పోలీసులు  తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.స్థానిక అంబజారీ ప్రాంతానికి  చెందిన ఓ 15 ఏండ్ల బాలికకు సోషల్‌ ‌డియా  ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత సదరు వ్యక్తి ఆ బాలికకు లైంగికంగా దగ్గరవ్వడంతో ఆమె గర్భందాల్చింది. ఆ విషయాన్ని బాలిక ఇంట్లో చెప్పకుండా దాచిపెట్టింది. కొన్ని రోజులకు కడుపు పెద్దగా కనిపించడంతో తల్లి ప్రశ్నించింది. అయితే అనారోగ్యం కారణంగానే కడుపు ఉబ్బిందంటూ తల్లికి అబద్దాలు చెప్పింది.
అనంతరం డెలివరీ ఎలా చేసుకోవాలో యూట్యూబ్‌ ‌వీడియోలను చూసి తెలుసుకుంది. ఈ నెల 2వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పసికందును గొంతునులిమి చంపేసి.. ఇంట్లోనే ఓ పెట్టెలో మృతదేహాన్ని దాచిపెట్టింది. పనిద బయటకు వెళ్లిన తల్లి ఇంటికి తిరిగొచ్చేసరికి బాలిక అనారోగ్యంతో నీరసంగా కనిపించింది. దీంతో ఆమె గట్టిగా నిలదీయగా.. ఆ బాలిక మొత్తం విషయాన్ని తల్లికి చెప్పేసింది. బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి.. నవజాతశిశువు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించామని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *